News September 17, 2024

గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం కమిటీ

image

TG: గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన రాష్ట్ర కార్మికుల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2023 డిసెంబర్ 7 తర్వాత గల్ఫ్‌లో మరణించిన వారి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ‘ప్రవాసీ ప్రజావాణి’ పేరుతో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులాల్లో ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది.

Similar News

News September 8, 2025

TTD ఈవోగా మరోసారి సింఘాల్.. ఆయన గురించి తెలుసా?

image

AP: 2017-20 మధ్య TTD EOగా పని చేసిన IAS అధికారి అనిల్ కుమార్ <<17648825>>సింఘాల్<<>> మరోసారి అక్కడికే బదిలీ అయ్యారు. గతంలో ఆయన తిరుమలలో టైమ్ స్లాట్ దర్శన, టోకెన్ల విధానాన్ని ప్రవేశపెట్టారు. శ్రీవాణి ట్రస్ట్‌కు రూపకల్పన చేసి అమలు చేశారు. ఆ ట్రస్ట్ ద్వారా TTD ఖజానాకు నెలకు రూ.450 కోట్ల ఆదాయం వస్తోంది. TTDలో అన్యమత ఉద్యోగుల గుర్తింపు కోసం సర్వే చేశారు. 2020లో వైసీపీ ప్రభుత్వం సింఘాల్‌ను ఆరోగ్యశాఖకు బదిలీ చేసింది.

News September 8, 2025

నేడే లాస్ట్.. రూ.1.26 లక్షల జీతంతో ఉద్యోగాలు

image

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో 841 ఉద్యోగాల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. 410 AAO (స్పెషలిస్ట్), 350 AAO (జనరలిస్ట్), 81 ఏఈ పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి అర్హత కలిగి ఉండాలి. వయసు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ.88,635 నుంచి రూ.1.26 లక్షల వరకు ఉంటుంది. <>www.licindia.in<<>> సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News September 8, 2025

BRSకు రాజకీయంగా కనెక్టివిటీ పోయింది: ఎంపీ చామల

image

TG: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయలేమని <<17647664>>BRS<<>> చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితంతో రాజకీయంగా వీరికి కనెక్టివిటీ పోయిందని దుయ్యబట్టారు. ఏ పార్టీకి చెందని సుదర్శన్ రెడ్డికి ఓటు వేయకపోవడం దారుణమని విమర్శించారు. ఎన్నికలకు దూరంగా ఉండటం చూస్తే లోక్‌సభతో పాటు రాజ్యసభలో కూడా బీఆర్ఎస్ అవసరం లేని పార్టీగా మారిపోయిందన్నారు.