News September 17, 2024
NRPT: 250 మంది పోలీసులతో బందోబస్తు

నారాయణపేట జిల్లా కేంద్రంలో నేటి అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే గణేశ్ శోభాయాత్రకు 250 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. గణేశ్ మార్గ్‌లో సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి సమీక్ష చేస్తామని చెప్పారు. జిల్లా కేంద్రంలోని వచ్చే వాహనాలను ఇతర మార్గాల ద్వారా డైవర్ట్ చేశామని అన్నారు. ప్రధాన కూడళ్లలో పోలీస్ పీకేటింగ్ ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News February 27, 2026
పాలమూరు: హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి

TGSC స్టడీ సర్కిల్‌లో 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tsstudycircle.co.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. మహబూబ్ నగర్‌లోని NTR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మార్చి1న ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
News February 27, 2026
MBNR: ‘ఆవిష్కరణలే లక్ష్యంగా గ్రాన్ టూరిస్మో 2.0’

పాలమూరు యూనివర్సిటీలో ‘గ్రాన్ టూరిస్మో 2.0’ కార్యక్రమాన్ని వీసీ ప్రొఫెసర్ ఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ.. సైన్స్, మేనేజ్‌మెంట్ విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌ల వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి వేదికలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు సంఖ్యలో పాల్గొన్నారు.