News September 17, 2024
ఈరోజు నమాజ్ వేళలు

✒ తేది: సెప్టెంబర్ 17, మంగళవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:52 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:04 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:10 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:33 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:16 గంటలకు
✒ ఇష: రాత్రి 7.29 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News November 8, 2025
పైలట్‌ను నిందించలేం: సుప్రీంకోర్టు

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా క్రాష్‌కి సంబంధించి పైలట్‌ను నిందిచలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రమాదంలో చనిపోయిన మెయిన్ పైలట్ సుమిత్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. DGCA, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ‘ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరం. మీ కుమారుడిని ఎవరూ నిందిచలేరు. పైలట్ తప్పు వల్లే ప్రమాదం జరిగిందని దేశంలో ఎవరూ భావించడం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
News November 8, 2025
సంకటహర గణపతి వ్రతం ఎలా చేయాలంటే..?

నల్ల నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయాలి. గణపతి పూజ చేసి, ఎర్ర గుడ్డలో పసుపు, కుంకుమ, బియ్యం, ఖర్జూరం, వక్కలు, దక్షిణ వేసి ముడుపు కట్టి, కోరిక మనసులో అనుకొని 21 ప్రదక్షిణలు చేయాలి. ఉపవాసం, మౌనంగా ఉంటూ గణపతిని కొలవాలి. సాయంత్రం దీపాలు పెట్టాలి. ముడుపు బియ్యంతో బెల్లం పాయసం, ఉండ్రాళ్లతో నైవేద్యం పెట్టాలి. వ్రతానికి ముందు రోజు, తర్వాత రోజు కూడా మద్యమాంసాలు ముట్టొద్దు. మరుసటి రోజు హోమం చేస్తే శుభం.
News November 8, 2025
‘ఓట్ చోరీ’.. యువతి సెల్ఫీ దుమారం!

ఓట్ చోరీ జరుగుతోందని రాహుల్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దానికి బలం చేకూర్చేలా ఓ లాయర్ సెల్ఫీ వైరలవుతోంది. పుణేకు చెందిన ఉర్మీ అనే లాయర్ బిహార్‌లో ఎన్నికల రోజు.. ‘Modi-Fied ఇండియా కోసం ఓటేశాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాంగ్రెస్ ఫాలోవర్స్ ఆమె అకౌంట్‌ను పరిశీలించగా.. గతంలో ‘పుణే ఎన్నికల్లో ఓటేశాను’ అని మరో ఫొటో ఉంది. ఇలాగే ఓటేస్తున్నారు అని కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె ఫొటోలను షేర్ చేస్తున్నారు.


