News September 17, 2024
దద్దరిల్లుతున్న హైదరాబాద్

వినాయక నిమజ్జనాలు, భారీ జులూస్‌లతో హైదరాబాద్ దద్దరిల్లుతోంది. వేలాది విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు క్యూ కట్టాయి. మరికాసేపట్లో ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణేశుడి భారీ శోభాయాత్ర ప్రారంభంకానుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కళాకారుల నృత్యాలు, డప్పు చప్పుళ్లు, LED లైట్ల నడుమ యువత కేరింతలు కొడుతున్నారు. ‘జై బోలో గణేశ్ మహరాజ్‌కి జై’ నినాదంతో HYD హోరెత్తింది.
Similar News
News January 17, 2026
మేడారంలో రేపు రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం

రేపు మేడారంలో రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. మేడారం హరిత హోటల్‌లో సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. సచివాలయాన్ని దాటి తొలిసారిగా కేబినెట్ సమావేశం జరగడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సమావేశంలో మేడారం మాస్టర్ ప్లాన్‌పై విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే MPTC, ZPTC, మున్సిపల్ ఎన్నికలు, రిజర్వేషన్ల అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
News January 17, 2026
బీఆర్‌ఎస్ MLAలు, MLCలతో నేడు KTR కీలక భేటీ

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ నేడు కీలక భేటీ నిర్వహించనున్నారు. పార్టీ సీనియర్ నేతలతో ఆయన బ్రేక్‌ఫాస్ట్ సమావేశం కానున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ చేపట్టేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. సికింద్రాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది.
News January 17, 2026
హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందంటే..?

HYDలో ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూనే ఉంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ బాలాపూర్‌లో శనివారం తెల్లవారుజామున 254కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత వారంలో కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత.. మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది.


