News September 17, 2024

భారత్vs చైనా.. నేడు ఫైనల్

image

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలతో అదరగొట్టిన భారత పురుషుల హాకీ జట్టు ఇవాళ ఫైనల్‌లో చైనాను ఢీకొట్టనుంది. మధ్యాహ్నం 3.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. సోనీ స్పోర్ట్స్ టెన్-1 ఛానల్, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగుతున్న టీమ్ ఇండియా ఐదో ట్రోఫీ సాధించాలని పట్టుదలగా ఉంది. అనూహ్యంగా ఫైనల్ చేరిన చైనా తొలి టైటిల్ కోసం ఆరాటపడుతోంది.

Similar News

News January 23, 2026

DRDOలో పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>DRDO<<>>కు చెందిన ఢిల్లీలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్‌లో 9 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి పీజీ సైకాలజీ, అప్లైడ్ సైకాలజీ, పీహెచ్‌డీ, NET, GATE అర్హత సాధించిన వారు అప్లై చేసుకోవచ్చు. JRFకు గరిష్ఠ వయసు 28ఏళ్లు కాగా.. రీసెర్చ్ అసోసియేట్‌కు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://www.drdo.gov.in

News January 23, 2026

నిన్న విజయసాయి రెడ్డి.. మిథున్ రెడ్డి

image

AP: మద్యం కుంభకోణం కేసులో ED విచారణకు YCP MP మిథున్‌రెడ్డి హాజరయ్యారు. ఇదే కేసులో నిన్న విజయసాయిరెడ్డిని 7 గంటల పాటు ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ED కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం రాజ్ కసిరెడ్డికే తెలుసని.. మిథున్ రెడ్డి కోరిక మేరకు ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేశానని నిన్న విజయసాయి తెలిపారు. ఈ నేపథ్యంలో నేటి విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది.

News January 23, 2026

న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ దూరం!

image

T20 WCకు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బౌలర్ ఆడమ్ మిల్నే టోర్నీకి దూరమయ్యారు. SA20లో ఆడుతుండగా ఎడమ తొడ కండరాలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడి స్థానంలో కైల్ జేమీసన్‌ను NZ రీప్లేస్ చేసింది. ఓరూర్కీ, టిక్నర్, నాథన్ స్మిత్, బెన్ సీర్స్ ఇప్పటికే గాయపడ్డారు. ఫెర్గ్యూసన్, మ్యాట్ హెన్రీ పెటర్నిటీ లీవ్స్‌ కారణంగా WCలో కొన్ని మ్యాచులకు దూరమయ్యే అవకాశముంది.