News September 17, 2024
ఒకే వేదికపైకి రేవంత్, కేటీఆర్!

TG: ఒకరిపై మరొకరు నిత్యం తీవ్ర విమర్శలు చేసుకునే సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికను పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మరణించిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభను ఈనెల 21న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు కేటీఆర్‌కు ఆహ్వానం పంపామని, వారు పాల్గొంటారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.
Similar News
News November 9, 2025
బాధపడొద్దు.. తెల్ల జుట్టు మంచిదే : సైంటిస్ట్‌లు

జుట్టు తెల్లబడటం మంచిదే అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. శరీరంలో క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలను నాశనం చేసే ప్రాసెస్‌లో జుట్టు రంగు కోల్పోతుందని చెబుతున్నారు. మెలనోసైట్ సెల్స్ కారణంగా జుట్టు నల్లగా ఉంటుందని, ఎప్పటికప్పుడు కొత్తగా ఏర్పడే ఈ కణాలు జుట్టుకు రంగును అందిస్తాయని అంటున్నారు. శరీరంలో క్యాన్సర్‌గా మారే కణాలను అంతం చేసే ప్రక్రియలో మెలనోసైట్స్ తమను తాము చంపుకుంటాయని స్పష్టం చేస్తున్నారు.
News November 9, 2025
వైస్ కెప్టెన్సీ వల్లే T20 జట్టులో గిల్?

బ్యాటింగ్‌లో విఫలమవుతున్నా గిల్‌కు T20 జట్టులో చోటు కల్పిస్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వైస్ కెప్టెన్‌గా ఉన్నందునే జట్టులో ఉంచుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జైస్వాల్, సంజూ మంచి ఫామ్‌లో ఉన్నా గిల్ కోసం వారిని బెంచ్‌కే పరిమితం చేస్తున్నారని అంటున్నారు. 19 T20ల్లో 136SRతో గిల్ 502రన్స్ చేశారు. అటు జైస్వాల్ 6 T20ల్లో 170SRతో 221, సంజూ 13 T20ల్లో 182SRతో 417 పరుగులు చేశారు.
News November 9, 2025
తుఫాను బీభత్సం.. 224కు చేరిన మృతుల సంఖ్య

ఫిలిప్పీన్స్‌లో కల్మేగీ తుఫాను మరణ మృదంగం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 224మంది మృతి చెందగా 109మంది గల్లంతయ్యారు. ఒక్క సెబూ ఐలాండ్‌లోనే వరదల వల్ల 158మంది చనిపోయారు. 526 మంది గాయపడగా 700 మందికి పైగా నిరాశ్రయులు అయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఆ దేశంలోని 53 కమ్యూనిటీస్‌లో ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ఈ తుఫానును ఆ దేశ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ జాతీయ విపత్తుగా ప్రకటించారు.


