News September 17, 2024
పలాస: దుస్తులు చించి ఆశా వర్కర్‌పై దాడి?

పలాస(M) లక్ష్మీపురం(P) కిష్టుపురంలో ఆశా వర్కర్ బూర్లె కృష్ణవేణిపై సోమవారం రాత్రి దాడి జరిగింది. బాధితురాలి వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లలితమ్మ జ్వరానికి, బీపీకి మాత్రలు కావాలని కోరారు. జ్వరానికి మాత్రలు ఇచ్చి.. బీపీకి డాక్టర్లే చెక్ చేసి ఇస్తారన్నారు. దీంతో లలితమ్మ భర్త కృష్ణారావు, ఆమె కుమారుడు మోహన్ కృష్ణవేణిపై దాడి చేశారు. తన నైటీని కూడా చించేశారంటూ సీఐ మోహనరావుకు ఆమె ఫిర్యాదు చేశారు.
Similar News
News January 12, 2026
పలాసలో భయపెట్టిస్తున్న గన్ కల్చర్

పలాసలో మరోసారి గన్ కల్చర్‌తో అలజడి రేగింది. ఈనెల 9న పలాస రైల్వే టూ వీలర్ పార్కింగ్ స్థల టెండర్ విషయంలో గన్, కత్తులతో కొందరు బెదిరింపులకు పాల్పడగా పోలీసులు అరెస్ట్ చేశారు. 2024 NOVలో ఓ టీడీపీ నేత హత్యకు గన్స్‌తో వచ్చిన సుపారీ గ్యాంగ్ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలు 1978-80ల నాటి క్రైమ్‌ను ప్రజలకు గుర్తు తెస్తున్నాయి. అప్పట్లోనూ నాటు తుపాకులు, కత్తులతో దాడులు చేసి ముగ్గురిని హతమార్చారు.
News January 12, 2026
కాశీబుగ్గ: చిన్న తిరుపతి వెంకన్నకు కష్టాలు తప్పవా?

తిరుపతిలోని వేంకటేశ్వురుడి దర్శనం జరగనందున ఆవేదన చెంది కాశీబుగ్గలో ఏకంగా ఆ శ్రీనివాసుడికి ధర్మకర్త పండా గుడి కట్టారు. భక్తుల దర్శనాలు జరుగుతున్న క్రమంలో..గతేడాది NOV1న తొక్కిసలాటలో 9 మంది మృతి చెందగా ఆలయాన్ని మూసేశారు. పునఃప్రారంభానికి శరవేగంగా పనులవుతున్నాయి. ఇంతలోనే భారీ <<18834092>>చోరీ<<>> జరిగింది. పూజలందుకోవాల్సిన వెంకన్నకు కష్టాలు తప్పడం లేదని పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు.
News January 12, 2026
అంతర్జాతీయ బ్యాడింటన్ పోటీలకు అంపైర్‌గా కవిటి వాసి

కవిటి గ్రామానికి చెందిన తుంగాన శరత్ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంటుకు అంపైర్‌గా ఎంపికయ్యారు. ఈ నెల 13-18 వరకు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే పోటీలకు ఆయన అంపైర్‌గా వ్యవహరించనున్నారు. ఈ ఎంపికకు సంబంధించి రాష్ట్ర, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ల నుంచి ఆదివారం అధికారిక ఉత్తర్వులు అందినట్లు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జయరాం తెలిపారు.


