News September 17, 2024
కొత్త రేషన్ కార్డుల అంశంపై ప్రజల్లో సందేహాలు

TG: రేషన్ కార్డులను విభజించి స్మార్ట్ రేషన్ కార్డులు, స్మార్ట్ హెల్త్ కార్డులు ఇస్తామని మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కార్డుల జారీకి లబ్ధిదారుల ఆదాయ పరిమితి, అర్హతలపై నిబంధనలను పున:సమీక్షిస్తామని చెప్పడంతో ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. బియ్యం అవసరం లేని వారికి స్మార్ట్ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పడంపైనా అనుమానాలున్నాయి. ఈ నెల 21న ఈ అంశంపై తుది నిర్ణయం రానుంది.
Similar News
News November 11, 2025
షమీ విషయంలో ఆరోపణలను ఖండించిన BCCI!

షమీని కావాలనే సెలక్ట్ చేయట్లేదన్న ఆరోపణలను ఓ BCCI అఫీషియల్ ఖండించినట్లు PTI పేర్కొంది. ‘షమీ ఫిట్‌నెస్‌పై తరచూ వాకబు చేస్తూనే ఉన్నాం. అతణ్ని ఇంగ్లండ్ సిరీస్‌కు పంపేందుకు ప్రయత్నించాం. ఇంగ్లండ్ లయన్స్‌పై భారత్-A తరఫున అతడిని బరిలోకి దింపితే ఫిట్‌నెస్‌పై అంచనా వస్తుందనుకున్నాం. కానీ సిద్ధమయ్యేందుకు షమీ తగిన సమయం కావాలన్నారు. అతణ్ని సంప్రదించలేదన్నది అవాస్తవం’ అని ఆయన చెప్పినట్లు వెల్లడించింది.
News November 11, 2025
వరద బాధిత కుటుంబాలకు ₹12.99 కోట్ల సాయం

TG: మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయంగా ₹12.99 కోట్లు అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వర్షాలు, వరదల్లో 15 జిల్లాల్లో 8662 ఇళ్లు దెబ్బతిన్నట్లు కలెక్టర్లు నివేదికలు పంపారు. ఈ ఇళ్ల యజమానులకు ₹15,000 చొప్పున అందించనున్నారు. ఈ నిధులను నేరుగా బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. అక్టోబర్ 27-30 వరకు వరుసగా 4 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలతో ఈ నష్టం వాటిల్లింది.
News November 11, 2025
లారీ బీభత్సం.. ముగ్గురు మృతి

నెల్లూరు: NTR నగర్ వద్ద నేషనల్ హైవేపై చేపల లోడుతో వెళ్తున్న కంటెయినర్ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ రోడ్డు పక్కన గల షాపులతో పాటు టాటా ఏస్, 3 బైకులు, చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలు సహా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


