News September 17, 2024

వచ్చే ఏడాది నుంచి ‘ఇంటర్’ ఎత్తివేత!

image

TG: NEP-2020లో భాగంగా రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్యావిధానాన్ని ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపై విద్యార్థులకు 5+3+3+4 విధానం అమలు చేయాలని చూస్తోంది. తొలి ఐదేళ్లలో అంగన్‌వాడీ, ప్రీస్కూల్ మూడేళ్లతో పాటు 1,2 తరగతులుంటాయి. ఆ తర్వాతి మూడేళ్లు 3,4,5 క్లాసులు, ఆపైన 6,7,8 తరగతులు చదవాలి. చివరి నాలుగేళ్లలో సెకండరీ ఎడ్యుకేషన్ కింద 9,10,11,12 తరగతుల్లో చేరాలి.

Similar News

News September 16, 2025

ఆక్వా జోన్ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: జేసీ

image

జిల్లాలో ఆక్వా జోన్ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో ఆక్వా జూన్ సర్వేపై జిల్లాలోని మత్స్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఆక్వా జోన్ పరిధిలోనికి తీసుకురావడానికి భీమవరం, ఆకివీడు మండలాల నివేదికలు అందాల్సి ఉందని, మిగతా అన్ని మండలాల్లో సర్వేను పూర్తి చేసి నివేదికలను అందజేయడం జరిగిందన్నారు.

News September 16, 2025

OG రిలీజ్.. పేపర్లతో థియేటర్ నిండిపోతుంది!

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే థియేటర్ల వద్ద రచ్చ మామూలుగా ఉండదు. అలాంటిది భారీ అంచనాల మధ్య రిలీజయ్యే ‘OG’కి ఇంకెంత క్రేజ్ ఉండాలి. ఈనెల 25న ఫ్యాన్స్ షోలో థియేటర్లను పేపర్లతో నింపేందుకు అభిమానులు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా మల్కాజిగిరిలోని సాయి రామ్ థియేటర్‌లో స్పెషల్ షో కోసం ఏర్పాటు చేసిన పేపర్స్ చూసి ఇతర అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వందల కేజీల న్యూస్ పేపర్లను కట్ చేయడం విశేషం.

News September 16, 2025

ప్రైవేట్ హాస్పిటళ్లపై సీఎం ఆగ్రహం

image

TG: ఈ రోజు రాత్రి నుంచి <<17723721>>ఆరోగ్యశ్రీ సేవలను బంద్<<>> చేస్తామని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటించడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా నెలకు రూ.75 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తున్నా బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. ప్రతినెలా బెదిరింపులు తంతుగా మారాయని, ఇక నుంచి అలా చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.