News September 17, 2024
పల్నాడు: ప్రమాదవశాత్తు కాలువలో పడి వివాహిత మృతి

ద్విచక్ర వాహనంపై వెళుతూ.. ప్రమాదవశాత్తు కాలువలో పడి వివాహిత మృతి చెందిన ఘటన నకరికల్లులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి అతని భార్య శివ కలిసి ద్విచక్ర వాహనంపై బంధువుల ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో కెనాల్ కాలువ కట్టపై వెళ్తుండగా.. కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి ఇద్దరు కాలువలో పడ్డారు. భర్త ఒడ్డు పట్టుకుని బయటకు రాగా, భార్య కాలువలో గల్లంతై మృతి చెందింది.
Similar News
News December 24, 2025
తాడేపల్లి: పవన్ రాక.. నాగేశ్వరమ్మ సంతోషానికి హద్దులు లేవు.!

డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ రాకతో ఇండ్ల నాగేశ్వరమ్మ సంతోషం ఆకాశాన్ని తాకింది. ఇచ్చిన మాట ప్రకారం జనసేన అధినేత వస్తున్నాడని సమాచారంతో బుధవారం ఆమె ఇప్పటం గ్రామంలోని తన ఇంటిని పార్టీ జెండాలతో అలంకరణ చేసి, పుష్పాలతో స్వాగతం పలికారు. బంగారు కొండని సంబోధిస్తూ ఎంతో ఆప్యాయంగా పవన్‌ను ఆహ్వానించారు. పవన్ తన జీతం నుంచి రూ.5వేలు ప్రతినెల పెన్షన్ రూపంలో ఇస్తానని హామీ ఇవ్వడంతో నాగేశ్వరమ్మ ఎమోషనల్ అయ్యారు.
News December 24, 2025
GNT: జమాబందీ లేక భూ రికార్డుల్లో గందరగోళం

గుంటూరు జిల్లా రెవెన్యూ శాఖలో కీలకమైన జమాబందీ ప్రక్రియను కొన్నేళ్లుగా నిర్వహించకపోవడంతో భూమి రికార్డులు గందరగోళంగా మారాయి. తహశీల్దార్ కార్యాలయాల్లో ఆర్వోఆర్ నిర్వహణ సరిగా లేకపోవడం, కంప్యూటర్ ఆపరేటర్లపై పూర్తిగా ఆధారపడటం వల్ల అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయి. ఏటా జమాబందీ జరిగితే భూమి హక్కులు స్పష్టమవుతాయి. కానీ అది లేకపోవడంతో జిల్లాలో భూవివాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
News December 24, 2025
GNT: ఆస్తి నీటి పన్నులు వసూళ్లలో వెనుకబడిన జిల్లా

గుంటూరు GMC సహా జిల్లాలోని మున్సిపాల్టీల్లో ఆస్తి, నీటి పన్నులు రూ.510.41 కోట్లు వసూలు చేయాలి. ఇప్పటి వరకు 29.14 శాతం అంటే 148.74 కోట్లు వసూలు చేశారు. ఒక్క గుంటూరు కార్పొరేషన్లోనే రూ.260.29 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంది. ఇక్కడ 25.55 శాతమే వసూలు కావడం గమనార్హం. గత ఏడాది కంటే పన్ను వసూళ్లలో వెనుకబడి ఉంది. తెనాలిలో 41.79, మంగళగిరి – తాడేపల్లిలో 62.29, పొన్నూరులో 49.01 శాతం వసూలు చేశారు.


