News September 17, 2024

కడప ఆర్మీ జవాన్ ఆకస్మిక మృతి

image

వేంపల్లి పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చెందిన చల్లా.సుబ్బారావు ఆర్మీలో ఉద్యోగం చేస్తు మరణించినట్లు బంధువులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీలో 18 ఏళ్లుగా ఉద్యోగం చేసేవాడు. ఈనెల 15వ తేదీన అనారోగ్యంతో మరణించడంతో ఆయన మృతదేహాన్ని మంగళవారం వేంపల్లెకు తీసుకువచ్చారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్య రేణుకా వారికి ఇద్దరు పిల్లలు హేమ,జగదీష్ కలరు. ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు.

Similar News

News January 14, 2026

గండికోటలో సందడి చేసిన హీరో కిరణ్ అబ్బవరం

image

గండికోట ఉత్సవాలలో సినీనటుడు, రాయచోటి వాసి కిరణ్ అబ్బవరం సందడి చేశారు. యువతతో ఫొటోలు తీసుకుంటూ కలియతిరిగారు. అనంతరం మాట్లాడుతూ.. తనని ఈ ఉత్సవాలకు ఆహ్వానించిన కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 20-25 ఏళ్ల వయసులోని యువత వారి ఆలోచనా విధానం కేవలం సంపాదించాం, ఎంజాయ్ చేశామన్న చిన్నపాటి సంతోషాలకే పరిమితం అవుతున్నారు. కానీ అది కాదు జీవితం. కెరీర్ పరంగా సుస్థిర స్థానం పొందాలిని యువతకు సూచించారు.

News January 13, 2026

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

image

సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రజలు, పోలీస్ సిబ్బందికి ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటిల్లిపాది సంతోషంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికెళ్లకుండా భోగి, మకర సంక్రాంతి, కనుమను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.

News January 13, 2026

కడప జిల్లాలో 99,508 హెక్టార్లలో రబీ పంటల సాగు

image

జిల్లాలో రబీ పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1,39,796 హెక్టార్లు కాగా, ఈ ఏడాది
99,508 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. పప్పు సెనగ 68,207, మినుము 12,421, మొక్కజొన్న 5,390, వరి 4,223, జొన్న 2,110, కుసుమ 1.970, వేరుశనగ 1,259, గోధుమ 28, సజ్జ 783, రాగి 115, కొర్ర 81, కంది 143, పెసర 949, ప్రొద్దుతిరుగుడు 422, పత్తి 248 హెక్టార్లలో సాగయ్యింది. గత ఏడాది 1,10,776 హెక్టార్లలో సాగైనట్లు అధికారులు తెలిపారు.