News September 17, 2024
Stock Market: ఇన్వెస్టర్లు జాగ్రత్తపడ్డారు

US ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఊహాగానాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడ్డారు. సెన్సెక్స్ రోజంతా 82,866 – 83,153 మధ్య కన్సాలిడేట్ అవుతూ చివరికి 90 పాయింట్ల లాభంతో 83,079 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 25,418 వద్ద నిలిచింది. హీరో మోటార్స్, బజాజ్ ఆటో, Airtel టాప్ గెయినర్స్. టాటా మోటార్స్, ఐచర్, టాటా స్టీల్, కోల్ ఇండియా, JSW Steel టాప్ లూజర్స్.
Similar News
News November 2, 2025
టాస్ గెలిచిన టీమ్ ఇండియా

ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బౌలింగ్ ఎంచుకుంది.
భారత జట్టు: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్(C), తిలక్ వర్మ, జితేశ్, దూబే, అక్షర్, అర్షదీప్, సుందర్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్(C), హెడ్, ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, ఓవెన్, స్టోయినిస్, బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, అబాట్
News November 2, 2025
WWC ఫైనల్: వన్డేల్లో పైచేయి ఎవరిదంటే..

ఇండియా, సౌతాఫ్రికా మధ్య మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో మొదలుకానుంది. వన్డేల్లో ఇప్పటిదాకా 34 మ్యాచుల్లో 2 టీమ్స్ తలపడ్డాయి. ఇందులో 20-13 లీడ్‌తో ఇండియాదే పైచేయి కావడం గమనార్హం. ఓ మ్యాచ్ రిజల్ట్ రాలేదు. ఇక WCలో 6 మ్యాచ్‌లు ఆడగా తలో 3 గెలిచాయి. చివరగా WWCలోనే విశాఖలో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిచింది. మరోవైపు ఇవాళ్టి మ్యాచ్‌కు కాస్త వర్షం ముప్పు ఉందని తెలుస్తోంది.
News November 2, 2025
‘RSS బ్యాన్’ వ్యాఖ్యలు.. ఖర్గేకు అమిత్ షా కౌంటర్

RSSను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. RSSను ‘దేశభక్తి సంస్థ’ అని కొనియాడారు. ‘దేశాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చేందుకు నాలాంటి ఎంతో మందికి RSS స్ఫూర్తినిచ్చింది. దేశభక్తి, క్రమశిక్షణను పెంపొందించింది. ఉత్తమ PMల జాబితాలో నిలిచే వాజ్‌పేయి, మోదీ ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చారు’ అని చెప్పారు. ఖర్గే కోరుకున్నది ఎప్పటికీ జరగదన్నారు.


