News September 17, 2024

MDK: ముగ్గురు వైద్య సిబ్బంది సస్పెండ్

image

కౌడిపల్లి ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు వైద్య సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. కౌడిపల్లి ఆస్పత్రిని నేడు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. సిబ్బంది రమేష్, రాధాకృష్ణ, అహ్మద్ షకీల్ హాజరు పట్టికలో సంతకం చేసి విధుల్లో లేకపోవడంతో ఆ ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్ఓ డా. శ్రీరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.

Similar News

News March 2, 2026

రాష్ట్రస్థాయి పోటీలకు కూచన్ పల్లి విద్యార్థిని

image

కూచన్ పల్లి ఉన్నత పాఠశాల విద్యార్థిని అభినయ రాష్ట్ర స్థాయి మోడల్ యునైటెడ్ నేషన్స్ పోటీలకు ఎంపికైనట్లు MEO నాచారం మధుమోహన్ తెలిపారు. రెండు రోజుల క్రితం మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో కూచన్ పల్లి పాఠశాల నుంచి అభినయ, సాత్విక, సహస్రలు పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 9వ తరగతి విద్యార్థిని అభినయ రాష్ట్ర స్థాయికి ఎంపికైంది.

News March 1, 2026

మెదక్: రేపు యథావిధిగా ‘ప్రజావాణి’

image

మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం లాగే రేపు ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా అధికారులందరూ సమయపాలన పాటిస్తూ విధిగా హాజరుకావాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

News February 28, 2026

మెదక్: ఇన్‌ఛార్జ్ మంత్రిని కలిసిన కలెక్టర్!

image

మెదక్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలెక్టర్ ప్రతిమా సింగ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మూడు రోజుల క్రితమే కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె, మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. ప్రభుత్వంపై నమ్మకం వమ్ము చేయకుండా బాధ్యతలు నిర్వర్తిస్తానని కలెక్టర్ తెలిపారు.