News September 18, 2024
ప్రభుత్వ ఆసుపత్రుల అధికారులతో ప్రకాశం కలెక్టర్ సమీక్ష

ఆస్పత్రులలో పారిశుద్ధ్యం, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆయా ఆస్పత్రుల వారీగా ఉన్న సిబ్బంది విధుల కేటాయింపు, పారిశుద్ధ్యం, భద్రత, వివిధ పనులలో పురోగతిపై చర్చించారు. హెచ్.డి.ఎస్. నిధుల లభ్యత, ఎన్.టి.ఆర్. వైద్య సేవలు లభిస్తున్న తీరు తదితరాలపై సమీక్షించారు.
Similar News
News September 19, 2025
ప్రకాశం నూతన కలెక్టర్ టార్గెట్ ఇదేనా..!

ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్‌గా రాజాబాబు బాధ్యతలు స్వీకరించారు. తొలిరోజే వెలుగొండ పూర్తి చేయడమే లక్ష్యమని చెప్పారు. ఇందులో భాగంగా ఆయన తొలి జిల్లా పర్యటనను వెలుగొండ నుంచి ప్రారంభించడం విశేషం. వెలుగొండకు మంచి రోజులు వస్తాయని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
News September 19, 2025
మహిళను హింసించిన కేసులో నలుగురికి రిమాండ్

తర్లుపాడు మండలం కులుజ్వులపాడులో భర్త భార్యను పందిరి గుంజకు కట్టి బెల్ట్‌తో కొట్టిన ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పొదిలి CI వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన వివరాల మేరకు.. మద్యానికి బానిసైన నిందితుడు డబ్బు కోసం భార్యను కట్టేసి కొట్టాడు. అతనితో పాటు మిగిలిన ముగ్గురు నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించి ఒంగోలు జైలుకు తరలించారు. తర్లుపాడు SI బ్రహ్మనాయుడిని CI అభినందించారు.
News September 19, 2025
దర్శి: విద్యార్థి మృతి.. బస్సుల నిలిపివేత

దర్శి మండలం తూర్పు చౌటపాలెంలో నిన్న రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళ్తున్న ముగ్గురిని ఓ స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో చౌటపాలేనికి చెందిన ఇంటర్ విద్యార్థి యేసురాజు(17) మృతిచెందాడు. దీంతో ఇవాళ ఉదయం గ్రామానికి వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సులను ఎస్సీ కాలనీవాసులు అడ్డుకున్నారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగే వరకు బస్సులను గ్రామం నుంచి పంపించబోమన్నారు.