News September 18, 2024

ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

కడప జిల్లాలోని మండల ప్రత్యేకాధికారులు ప్రాధాన్యతా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో పీఎం విశ్వకర్మ యోజన, సాలిడ్ వెస్ట్ ప్రాసెసింగ్ సెంటర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, స్వచ్ఛతా హీ సేవ, హౌసింగ్, నూతన ఇసుక పాలసీ, తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ప్రతి మండలంలో అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు

Similar News

News January 26, 2026

ఉత్తమ జీఎస్టీ అధికారిగా జ్ఞానానంద రెడ్డి

image

ప్రొద్దుటూరు స్టేట్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ (CTO) జ్ఞానానంద రెడ్డి సోమవారం కడపలో కలెక్టర్ శ్రీధర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. పన్నుల ఆడిట్, వసూళ్లలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ఆయనను అభినందిస్తూ ప్రశంసా పత్రం ఇచ్చారు. పులివెందుల కార్యాలయానికి ఇన్‌ఛార్జ్‌గా కూడా ఉన్నారు. ప్రశంసా పత్రం అందుకున్న జ్ఞానానంద రెడ్డిని ప్రొద్దుటూరు, పులివెందుల కార్యాలయాల అధికారులు అభినందించారు.

News January 26, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు.
* బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.16,550
* బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.15,226
* వెండి 10 గ్రాముల ధర: రూ.3,560.

News January 26, 2026

కడప: ఇన్‌స్టాతో పరిచయం.. లాడ్జిలో యువతిపై అత్యాచారం

image

తిరుపతిలో దారుణం వెలుగుచూసింది. అలిపిరి CI రామ్ కిశోర్ వివరాల మేరకు.. కడప(D) బద్వేల్‌కు చెందిన యశ్వంత్ చిత్తూరులో బీటెక్ చదువుతున్నాడు. ఇన్‌స్టా ద్వారా తిరుపతి గ్రామీణ మండలానికి చెందిన అమ్మాయి పరిచయమైంది. ఆమెను మాయమాటలతో హోమ్‌స్టేకు పిలిపించిన విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరించి నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు CI తెలిపారు.