News September 18, 2024

DEC నెలకు శ్రీవారి టికెట్ల విడుదల తేదీలు

image

✒ ఆర్జిత సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్: SEP 18 ఉ.10 నుంచి 20వ తేదీ ఉ.10 వరకు
✒ వర్చువల్ సేవలు: 21న మ.3 గంటలకు
✒ అంగప్రదక్షిణ టోకెన్లు: 23న ఉ.10 గంటలకు
✒ శ్రీవాణి ట్రస్టు దాతల దర్శన కోటా: 23న ఉ.11 గంటలకు
✒ వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా: 23న మ.3 గంటలకు
✒ ప్రత్యేక ప్రదేశ దర్శనం(రూ.300) టికెట్లు: 24న ఉ.10 గంటలకు
✒ వసతి గదుల కోటా: 24న మ.3 గంటలకు

Similar News

News March 4, 2026

ఇంటర్వ్యూతో మెడికల్ ఆఫీసర్ పోస్టులు

image

<>కొచ్చిన్ <<>>షిప్‌యార్డ్ లిమిటెడ్ 3 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 10న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS అర్హతతో పాటు పని అనుభవం, మలయాళం భాషా పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 64ఏళ్లు. నెలకు రూ.75వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://cochinshipyard.in

News March 4, 2026

శాసన మండలి ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం?

image

AP: శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజుపై అవిశ్వాసం పెట్టాలని రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమ రాజీనామాను ఇంతవరకూ ఆమోదించకపోవడంపై నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాసం పెట్టేందుకు సరిపడా సంఖ్యాబలం ఉండటంతో ఆ దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ ఈ లిస్టులో ఉన్నారు.

News March 4, 2026

BJP ‘రాజ్య’సభ వ్యూహం ఇదే..

image

BJP <<19289210>>రాజ్యసభ<<>> అభ్యర్థుల ఎంపిక వెనక స్పష్టమైన వ్యూహాలు ఉన్నట్లు అర్థమవుతోంది. పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్‌ను ఎగువ సభకు పంపడం ద్వారా 2029 ఎన్నికల కోసం ఆయన్ను జాతీయ రాజకీయాల్లో స్థిరపరచాలని అనుకుంటోంది. కుల సమీకరణాలకు ప్రాధాన్యం ఉండే బిహార్‌లో దళిత నేత శివేశ్‌ను ఎంపిక చేసింది. అస్సాం, బెంగాల్ వంటి ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేలా అభ్యర్థులను సెలక్ట్ చేసింది.