News September 18, 2024

త్రివిక్రమ్‌పై పూనమ్ ఆరోపణలు.. స్పందించిన తమ్మారెడ్డి

image

డైరెక్టర్ త్రివిక్రమ్‌పై గతంలో ‘మా’కు ఫిర్యాదు చేశానని, ఆయనను ప్రశ్నించాలని హీరోయిన్ పూనమ్ కౌర్ చేసిన <<14124651>>ట్వీట్‌పై<<>> దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ‘ఆమెకు MAAకు ఏ సంవత్సరంలో, ఎందుకు ఫిర్యాదు చేసిందో తెలియదు. అప్పటికి కమిటీ ఏర్పాటై ఉంటే కంప్లైంట్ బాక్స్‌లో తన ఫిర్యాదు లెటర్ వేసి ఉంటే సరిపోయేది. ఇప్పటికైనా ఫిర్యాదు అందితే కచ్చితంగా చర్చిస్తాం’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Similar News

News March 10, 2026

Viral: పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష!

image

TG: ఆహ్వానం లేకుండా ఫంక్షన్‌కు వస్తే చర్యలు తప్పవని మహబూబాబాద్‌కు చెందిన హాల్ యజమాని బోర్డు పెట్టడం వైరల్‌గా మారింది. కొందరు ఇన్విటేషన్ లేకున్నా వస్తుండటంతో చాలా మంది తమ హాల్‌లో ఫంక్షన్లు చేయట్లేదని, దీంతో గిరాకీ తగ్గిందని ఆయన చెప్పారు. దీన్ని నివారించేందుకే ఫంక్షన్ హాల్ ఎదుట.. ‘ఆహ్వానం లేకుండా ఎవరైనా వస్తే 441 సెక్షన్ కింద 3నెలల జైలు శిక్ష, రూ.5,000 జరిమానా విధిస్తాం’ అని బోర్డు పెట్టారు.

News March 10, 2026

ఇకపై 4 కేటగిరీలుగా పంచాయతీలు

image

AP: జనాభా, ఆదాయం, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పంచాయతీల పునర్విభజనకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 3 రకాలుగా ఉన్న పంచాయతీలు ఇకపై 4 రకాలు కానున్నాయి. 10Kకు పైగా జనాభా, ₹కోటి వార్షిక ఆదాయం ఉన్న వాటిని రూర్బన్ పంచాయతీలుగా పరిగణించి పట్టణ తరహా సౌకర్యాలు కల్పిస్తారు. 3K-10K జనాభా, ₹30Lపైన ఆదాయం ఉంటే గ్రేడ్-1, 2Kలోపు జనాభా ఉంటే గ్రేడ్-2, 1,500 కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలను గ్రేడ్-3లో చేరుస్తారు.

News March 10, 2026

ఇన్‌స్టాలో సంజూ హవా..

image

T20WCలో అద్భుత ప్రదర్శనతో సంజూ శాంసన్ క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. సూపర్-8లో వెస్టిండీస్‌తో మ్యాచుకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో శాంసన్‌కు 12.1 మిలియన్ల ఫాలోవర్లు ఉండేవారు. ఆ మ్యాచుతో పాటు సెమీఫైనల్, ఫైనల్లోనూ చెలరేగడంతో ప్రస్తుతం ఆ సంఖ్య 17.5 మిలియన్లకు చేరింది. ఫైనల్లో టీమ్ ఇండియా విజయం తర్వాత ఏకంగా 1 మిలియన్‌కు పైగా నెటిజన్లు అతడిని ఫాలో కొట్టడం విశేషం.