News September 18, 2024
పింఛన్ల పంపిణీపై కీలక నిర్ణయం

AP: పింఛన్ పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం సవరణలు చేసింది. 1వ తేదీ సెలవు రోజుగా ఉంటే ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు అందించాలని పేర్కొంది. రెండో తేదీన మిగిలిన పంపిణీ పూర్తిచేయాలని, ఆ రోజూ సెలవు ఉంటే మూడో తేదీన పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. పంపిణీని ప్రారంభించిన తొలి రోజే దాదాపు 100 శాతం పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని ఆదేశించింది.
Similar News
News November 5, 2025
రేవంత్, కేసీఆర్‌పై కిషన్ రెడ్డి ఫైర్

TG: ఇచ్చిన హామీలు అమలు చేయని రేవంత్ ఏ ముఖం పెట్టుకొని జూబ్లీహిల్స్‌లో ఓట్లు అడుగుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎర్రగడ్డలో ప్రచారం సందర్భంగా రేవంత్, KCRపై ఆయన ఫైర్ అయ్యారు. ‘తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు అడిగితే రేవంత్ ఫ్రీ బస్సు అంటున్నారు. అటు కేసీఆర్ పాలనలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదు కానీ ఆయన కుటుంబీకులు ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు’ అని మండిపడ్డారు.
News November 5, 2025
బనకచర్ల, ఆల్మట్టిపై సుప్రీం కోర్టులో పోరాటానికి నిర్ణయం

TG: AP బనకచర్ల ప్రాజెక్టు, కర్ణాటక ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంపు అంశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఇప్పటికే నీటిపారుదల, జల వనరుల నిపుణుల నుండి అభిప్రాయం తీసుకుంటోంది. CM రేవంత్ రెడ్డికి దీనికి సంబంధించిన ఫైల్‌ను పంపి ఆయన ఆమోదించిన వెంటనే SCలో ఇంటర్లోక్యుటరీ అప్లికేషన్ దాఖలు చేయనుంది. ఈ 2 ప్రాజెక్టులపై TG ఇప్పటికే జలశక్తి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది.
News November 5, 2025
KTR.. రాజీనామాకు సిద్ధంగా ఉండు: CM రేవంత్

TG: సవాళ్లు విసిరి పారిపోవడం KTRకు అలవాటేనని CM రేవంత్ అన్నారు. ఆయన విసిరే సవాళ్లను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పట్టించుకోరని పేర్కొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఇచ్చిన నిధులపై జీవోలు ఇస్తామని, కేటీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్‌పేట్ రోడ్ షోలో ఆయన ప్రచారం నిర్వహించారు. రాష్ట్రానికి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.


