News September 18, 2024

ఆ కారణంతో రాబోయే 25 ఏళ్లలో 3.9 కోట్ల మంది మృతి!

image

వైద్యానికి లొంగని సూపర్ బగ్స్ లేదా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్(AMR) వల్ల గత 31 ఏళ్లలో 10 లక్షల మంది మరణించారని ఓ గ్లోబల్ సర్వే పేర్కొంది. రాబోయే 25 ఏళ్లలో ఈ సంఖ్య 3.9 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ తదితర దక్షిణాసియా దేశాల్లో సుమారు 1.18 కోట్ల మంది మరణిస్తారని హెచ్చరించింది. వైద్యరంగంలో ఎంతో సాంకేతికత సాధించినా AMR ఇప్పటికీ సవాల్‌గానే ఉంది.

Similar News

News January 23, 2026

ప్రభుత్వ బడుల్లో కేంబ్రిడ్జి పాఠాలు!

image

AP: ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించేలా కేంబ్రిడ్జి వర్సిటీ(UK)తో GOVT ఒప్పందం చేసుకోనుంది. దీనిద్వారా జాయింట్ రీసెర్చ్, కరిక్యులమ్ రూపొందిస్తారు. 8-10 తరగతుల్లో కేంబ్రిడ్జి సర్టిఫైడ్ ఆన్‌లైన్ కోర్సులు, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ప్రవేశపెడతారు. AU, IIT తిరుపతి సహా ఇంజినీరింగ్ కాలేజీల్లో వర్సిటీ భాగస్వామ్య కోర్సులు నిర్వహిస్తారు. ఈమేరకు దావోస్‌లో మంత్రి లోకేశ్ వర్సిటీ VCతో చర్చించారు.

News January 23, 2026

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, MBA/CFA/CA, MCom, BE/BTech అర్హతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 31వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తును careers@bobcaps.inకు ఈ మెయిల్ చేయాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in/

News January 23, 2026

మెస్సీ మ్యాచ్‌కు CSR నిధులు… ఇరకాటంలో సింగరేణి

image

TG: నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లు సహా సింగరేణి కార్యకలాపాలపై కేంద్ర బృందం లోతుగా పరిశీలిస్తోంది. కోల్ మైన్ టెండర్ల నిబంధనల వివాదం, అక్రమాలపై ఆరా తీస్తోంది. CSR నిధులపైనా దృష్టి పెట్టింది. ఇటీవల ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీతో ప్రైవేటు సంస్థ నిర్వహించిన ఈవెంట్‌కు CSR నిధులు వినియోగించారు. ఈవెంట్‌ కోసం ₹10cr నిధులు వాడినట్లు ప్రకటించడం తెలిసిందే. 3 రోజుల్లో ఈ బృందం కేంద్రానికి నివేదిక అందించనుంది.