News September 18, 2024

HYD: ఇబ్బందులు లేవు జనరల్ ట్రాఫిక్ వెళ్లొచ్చు: సీపీ

image

HYD సిటీ కమిషనర్ CV ఆనంద్ రంగంలోకి దిగారు. గణపతి నిమజ్జన చివరి ఘట్టం నేడు ఉదయం MJ మార్కెట్ రోడ్డుకు చేరుకుంది. ఎంజీ మార్కెట్ సహా, ట్యాంక్ బండ్ పరిసరాల పరిస్థితులను సీపీ పరిశీలించారు. కేవలం కొన్ని వాహనాలు మాత్రమే అప్రోచ్ రోడ్లలో ఉన్నాయని, తక్కువ సమయంలో నిమజ్జనం ముగుస్తుందని, జనరల్ ట్రాఫిక్ వెళ్లొచ్చన్నారు. గతం కంటే ఈసారి ఉదయం 5 గంటలకు, పరిస్థితి చాలా మెరుగుగా ఉందని అభిప్రాయపడ్డారు.

Similar News

News September 29, 2024

HYD: దూరవిద్య కోర్సుల పరీక్ష తేదీల ఖరారు!

image

PGRRCDE ద్వారా అందించే వివిధ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొ. రాములు తెలిపారు. ఎంసీఏ మొదటి, మూడో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను వచ్చే నెల 5 నుంచి, పీజీడీసీఏ 1వ, 2వ సెమిస్టర్ బ్యాక్ లాగ్, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ మొదటి సెమిస్టర్ మెయిన్ పరీక్షలను వచ్చే నెల 16 నుంచి నిర్వహిస్తామన్నారు. వివరాలకు www.osmania.ac.in లో చూడాలన్నారు.

News September 29, 2024

HYD: భూముల సేకరణలో TDR జారీకి కసరత్తు..!

image

HYD మీరాలం చెరువుపై చింతల్ మెట్ నుంచి బెంగళూర్ వైపు వెళ్లే రోడ్డు వరకు 2.5KM వంతెన నిర్మాణంలో ప్రైవేటు స్థలాలను సేకరించాల్సి ఉంది. ప్రైవేటు భూములకు పూర్తిగా TDR జారీ చేసేందుకు HMDA అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మియాపూర్ నుంచి గండిమైసమ్మ మార్గంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ, శివారు మున్సిపాలిటీల్లోని పనులకు TDR జారీ చేయనున్నారు.

News September 29, 2024

HYD: పింక్‌ పవర్‌ రన్‌.. పాల్గొన్న ఐటీ ఉద్యోగులు

image

HYD గచ్చిబౌలి స్టేడియంలో పింక్‌ పవర్‌ రన్‌ 3కే, 5కే, 10కే పింక్‌ పవర్‌ రన్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఐటీ, ఇతర ప్రైవేటు ఉద్యోగులు పాల్గొన్నారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ పింక్‌ పవర్‌ రన్‌ నిర్వహించారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌లో స్థానం సంపాదించేందుకు సుధారెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.