News September 18, 2024

శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు సంస్థ ఘరానా మోసం

image

శ్రీకాకుళం రైతు బజారు సమీపంలో ఓ ప్రైవేటు సంస్థ బాధితులను మోసం చేసిన ఘటన చోటుచేసుకుంది. ఆ సంస్థ తక్కువ పెట్టుబడితో లాభాలు పొందవచ్చని ఖాతాదారులను నమ్మించింది. జిల్లాలో సుమారు 3 వేల మంది సభ్యులుగా చేర్చుకుంది. పలు మార్గాల రూపంలో డబ్బులు వసూలు చేసి, 4 నెలలుగా అనుమానం కలగకుండా సక్రమంగా చెల్లింపులు జరిపింది. సంస్థ కార్యకలాపాలు అందుబాటులో లేకపోవడంతో మోసపోయామని బాధితులు పోలీసులకు సమాచారం అందించారు.

Similar News

News December 26, 2025

SKLM: గంజాయి రహిత జిల్లానే లక్ష్యం- ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లాలో మాదకద్రవ్యాల మహమ్మారిని రూపుమాపి, యువత భవిష్యత్తును కాపాడటమే తమ లక్ష్యమని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘నార్కో కో-ఆర్డినేషన్ సెంటర్’ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 115 గంజాయి హాట్-స్పాట్లను గుర్తించామని, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద 24 గంటల నిఘా ఉంచామన్నారు. అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

News December 26, 2025

SRKLM: ప్రమాదాల కట్టడికి ఎస్పీ మాస్టర్ ప్లాన్!

image

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు శాస్త్రీయ దృక్పథంతో అడుగులు వేయాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ‘బ్లాక్ స్పాట్స్’ వద్ద రక్షణ చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. మలుపుల వద్ద సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు.

News December 26, 2025

శ్రీకాకుళం: పెరిగిన కోడి గుడ్డు ధర ఎంతంటే !

image

ఎన్నడూ లేని విధంగా కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. రూ.8 ఉన్న గుడ్డు ధర రూ.10కి చేరింది. హోల్సేల్ మార్కెట్లోనే ఒక్కో గుడ్డు రూ.9.30 పలుకుతోంది. ప్రస్తుతం ఒక ట్రే రూ.270 నుంచి రూ.290కి చేరింది. క్రిస్మస్, న్యూఇయర్ కారణంగా ఎగుమతులు పెరగటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఎన్నడూ లేని విధంగా గుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన పడుతున్నారు.