News September 18, 2024
భీంపూర్: మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పులుల సంచారం
భీంపూర్ మండలం పెనుగంగ నదికి అవతల ఉన్న మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పులులు సంచరిస్తున్నాయి. రామ్‌నగర్- సావర్గాం మార్గంలో మూడు పులులు ఓ ద్విచక్ర వాహనదారుడికి కనిపించగా వాటిని ఫొటో తీశాడు. తిప్పేశ్వర్ అభయారణ్యం ఆయా గ్రామాలకు సమీపంలో ఉండటంతో తరుచూ పులులు కనిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వేసవిలో నది దాటి భీంపూర్ వస్తున్నాయన్నారు.
Similar News
News November 16, 2024
నార్నూరు: కొడుకును కత్తితో పొడిచిన తండ్రి
కొడుకును తండ్రి కత్తితో పొడిచిన ఘటన నార్నూర్ మండలంలోని గుంజల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం గుంజాల గ్రామానికి చెందిన మేస్రం భుజంగరావు కుటుంబ తగాదాల కారణంగా తన కొడుకు బాలాజీని కత్తితో పొడిచాడు. స్థానికులు గమనించి బాలాజీని ఉట్నూర్ తరలించారు. కాగా అక్కడి వైద్యులు రిమ్స్ కు రిఫర్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 16, 2024
మంచిర్యాల: భార్యాభర్తలను ఢీకొన్న అంబులెన్స్.. భర్త మృతి
గద్దెరాగడి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కోట సాంబశివరావు తన భార్య శివపార్వతితో కలిసి శుక్రవారం బైక్ పై మంచిర్యాలకు వెళ్తుండగా అంబులెన్స్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం MNCLకు, అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించారు. మార్గ మధ్యలోనే సాంబశివరావు మృతి చెందినట్లు SI రాజశేఖర్ వెల్లడించారు. కాగా వారు ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల నుంచి 15 ఏళ్ల క్రితం మందమర్రికి వలస వచ్చారు.
News November 16, 2024
నిర్మల్: రెండు ఉద్యోగాలు సాధించిన సమీర్
నిర్మల్ పట్టణంలోని గాజులపేట కాలనీకి చెందిన మహమ్మద్ సమీర్ గ్రూప్-4 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ఇటీవలే సమీర్ కానిస్టేబుల్‌గా ఎంపికై పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఈ రోజుల్లో ఒక ఉద్యోగం సాధించడం కోసమే నానా కష్టాలు పడుతుంటే రెండు ఉద్యోగాలు సాధించిన సమీర్‌ను పలువురు అభినందిస్తున్నారు.