News September 18, 2024

రేపు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం

image

ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు గురువారం ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రెండో విడత క్యాంటీన్‌ల ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించగా, రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

Similar News

News January 2, 2026

విజయవాడలో నేటి నుంచి బుక్ ఫెస్టివల్

image

విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జనవరి 2 నుంచి 12 వరకు 35వ పుస్తక ప్రదర్శన జరగనుంది. నేడు ప్రముఖుల సమక్షంలో ప్రారంభం కానున్న ఈ ప్రదర్శనలో 280కి పైగా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. గత 25 ఏళ్లలో కథ, నవల, కవిత, నాటక రంగాల్లో వచ్చిన మార్పులపై ప్రముఖులు చర్చా వేదికల్లో ప్రసంగించనున్నారు. యువ రచయితల పుస్తకాలు ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

News January 2, 2026

రాజ ముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ: కలెక్టర్

image

రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ కార్యక్రమం జనవరి 9వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారని చెప్పారు. జిల్లాలో మొత్తం 35,690 పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు.