News September 18, 2024
పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పిస్తున్నాం: మంత్రి శ్రీధర్

TG: పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా నూతన MSME పాలసీని రూపొందించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ మేరకు పలు రాయితీలను కల్పిస్తున్నామన్నారు. ‘MSMEల్లో ఆధునిక సాంకేతికతకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నాం. టెండర్ దరఖాస్తుకు ఖర్చు లేకుండా చేస్తున్నాం. పాలసీ విషయంలో 120 మంది పారిశ్రామిక ప్రముఖుల సలహాలు తీసుకున్నాం. రాష్ట్ర ఎకానమీని 1 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు.
Similar News
News September 8, 2025
8 కిలోల బరువు తగ్గిన హిట్‌మ్యాన్.. ఎలా అంటే?

ఫిట్‌గా మారేందుకు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 8 కిలోల బరువు తగ్గినట్లు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ ర్యాన్ ఫెర్నాండో తెలిపారు. ఐపీఎల్ తర్వాత 2-3 నెలల్లోనే డైట్, కఠోర సాధన చేసి వెయిట్ లాస్ అయినట్లు వెల్లడించారు. ఇందుకు ఆయన ఎలాంటి ఫ్యాషన్ డ్రగ్స్ వాడలేదని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కొందరు బరువు తగ్గేందుకు GLP-1 మందును వాడారు. కానీ హిట్‌మ్యాన్ మాత్రం ఆ మార్గాన్ని ఎంచుకోలేదని పేర్కొన్నారు.
News September 8, 2025
స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం?

TG: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు హైకోర్టును గడువు కోరే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెలాఖరుతో కోర్టు ఆదేశించిన డెడ్‌లైన్ ముగియనుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఓటరు స్లిప్పులు కూడా తయారు చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర సర్కార్ ఎన్నికలకు మరికొంత వ్యవధి కోరేందుకు సిద్ధమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
News September 8, 2025
విజయవాడలో వే2న్యూస్ కాన్‌క్లేవ్

వచ్చే పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతోంది? ఈ అంశంపై వే2న్యూస్ కాన్‌క్లేవ్ నిర్వహిస్తోంది. అమరావతి (మంగళగిరి) CK కన్వెన్షన్‌లో ఈనెల 12న ఈ సదస్సు జరగనుంది. దేశంలో డిజిటల్ మీడియా సంస్థ తొలిసారి నిర్వహిస్తున్న ఈ కాన్‌క్లేవ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు సహా రాష్ట్ర ప్రముఖులు ఎందరో హాజరుకానున్నారు. ఇందులో ఏపీ@2035 లక్ష్యాలు, ఆలోచనలతో రోడ్ మ్యాప్ ప్రజెంట్ చేస్తారు.
Note: Invite Only Event