News September 18, 2024
పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌గా పాంటింగ్?

IPLలో పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నియమితులయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన ఆ జట్టు యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారని cricbuzz వెల్లడించింది. 2018 నుంచి పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా పని చేశారు. 2019, 20, 21లో ఆ టీమ్ ప్లేఆఫ్స్‌కు వెళ్లింది.
Similar News
News September 8, 2025
స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం?

TG: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు హైకోర్టును గడువు కోరే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెలాఖరుతో కోర్టు ఆదేశించిన డెడ్‌లైన్ ముగియనుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఓటరు స్లిప్పులు కూడా తయారు చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర సర్కార్ ఎన్నికలకు మరికొంత వ్యవధి కోరేందుకు సిద్ధమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
News September 8, 2025
విజయవాడలో వే2న్యూస్ కాన్‌క్లేవ్

వచ్చే పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతోంది? ఈ అంశంపై వే2న్యూస్ కాన్‌క్లేవ్ నిర్వహిస్తోంది. అమరావతి (మంగళగిరి) CK కన్వెన్షన్‌లో ఈనెల 12న ఈ సదస్సు జరగనుంది. దేశంలో డిజిటల్ మీడియా సంస్థ తొలిసారి నిర్వహిస్తున్న ఈ కాన్‌క్లేవ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు సహా రాష్ట్ర ప్రముఖులు ఎందరో హాజరుకానున్నారు. ఇందులో ఏపీ@2035 లక్ష్యాలు, ఆలోచనలతో రోడ్ మ్యాప్ ప్రజెంట్ చేస్తారు.
Note: Invite Only Event
News September 8, 2025
నివేదా థామస్ లేటెస్ట్ ఫొటోస్ VIRAL

‘35 చిన్న కథ కాదు’ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చిన మలయాళ క్యూటీ నివేదా థామస్ తాజా ఫొటోలు వైరలవుతున్నాయి. వైట్ శారీలో ఓనమ్ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో గతంతో పోలిస్తే కాస్త బరువు తగ్గినట్లు ఉన్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా గద్దర్ అవార్డు వేడుకల సమయంలో నివేదా <<16710784>>బరువు<<>> పెరిగారంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.