News September 18, 2024

కలెక్షన్లలో ‘స్త్రీ-2’ రికార్డు

image

బాలీవుడ్‌ నటీనటులు రాజ్‌కుమార్‌ రావ్‌, శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించగా దర్శకుడు అమర్‌ కౌశిక్‌ తెరకెక్కించిన హారర్‌ కామెడీ ‘స్త్రీ-2’ రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 15న రిలీజైన ఈ సినిమా రూ.586 కోట్లు కలెక్ట్ చేసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ లైఫ్ టైమ్ కలెక్షన్లను క్రాస్ చేయడంతో ‘స్త్రీ-2’ ప్రస్తుతం అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచినట్లు తెలిపాయి.

Similar News

News October 19, 2025

ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు దగా చేశారు: వైసీపీ నేతలు

image

AP: ప్రభుత్వ <<18045253>>ఉద్యోగులను<<>> చంద్రబాబు మరోసారి దగా చేశారని వైసీపీ మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్, మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. 4 డీఏలు పెండింగ్‌లో ఉంటే ఒకటే చెల్లిస్తామని ప్రకటించారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి, ఇప్పుడు వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. తమపై విమర్శలు తప్ప, కూటమి ప్రభుత్వం సామాన్యులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏమి చేయట్లేదన్నారు.

News October 19, 2025

ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. రోకోపైనే అందరి దృష్టి

image

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమ్‌ఇండియా ఇవాళ తొలి వన్డే ఆడనుంది. ODI కెప్టెన్‌గా గిల్‌కిదే తొలి మ్యాచ్ కాగా AUSను ఎలా ఎదుర్కొంటాడో అనేది ఆసక్తిగా మారింది. 7 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న రోహిత్, కోహ్లీపైనే అందరి దృష్టి నెలకొంది. కీలక ప్లేయర్లు అందుబాటులో లేకున్నా స్వదేశంలో ఆసీస్‌ను తక్కువ అంచనా వేయలేం. మ్యాచ్ 9amకు ప్రారంభమవుతుంది. జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు.

News October 19, 2025

మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు పెంపు

image

TG: నూతన మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తు గడువును ఎక్సైజ్ శాఖ ఈ నెల 23 వరకు పొడిగించింది. బ్యాంకులు, నిన్న బీసీ బంద్ నేపథ్యంలో దరఖాస్తు చేయలేకపోయామన్న ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ నెల 23న తీయాల్సిన డ్రాను 27కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్న ఒక్క రోజే 30వేలకు పైగా దరఖాస్తులు రాగా మొత్తంగా 80వేలు దాటినట్లు అధికారులు వెల్లడించారు.