News September 18, 2024
తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారి!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా రిలీజ్‌కు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. తెలుగు సినిమా చరిత్రలో మొట్ట మొదటిసారిగా UKలో ‘డాల్బీ అట్మాస్’లో స్క్రీనింగ్ అవనుందని మేకర్స్ ప్రకటించారు. ఈనెల 26వ తేదీన యూకేలో ప్రీమియర్ షోలు ఉంటాయని తెలిపాయి. కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ ఓవర్సీస్ బుకింగ్స్‌లోనూ సంచలనాలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే.
Similar News
News September 14, 2025
అద్భుతం.. జైపూర్ ఫుట్ తరహాలో ‘వైజాగ్ హ్యాండ్’

వైజాగ్‌లోని ఏపీ మెడిటెక్ జోన్ దివ్యాంగుల కోసం కృత్రిమ చేయిని అభివృద్ధి చేసింది. ప్రమాదాల్లో చేతులు కోల్పోయిన వారికి ఉపయోగపడేలా ‘వైజాగ్ హ్యాండ్’ పేరుతో దీనిని రూపొందించింది. ఇటీవల ఓ మహిళకు అమర్చగా ఆమె స్వయంగా పనులు చేసుకున్నారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. జైపూర్ ఫుట్ తరహాలో చేతులు కోల్పోయిన వారికి ఇది సహకరిస్తుందని పేర్కొన్నారు. సోలార్ పవర్‌తో నడిచే వీల్‌చైర్లను కూడా తయారు చేస్తున్నామని చెప్పారు.
News September 14, 2025
ఇండియా-ఏ టీమ్ ప్రకటన.. అభిషేక్‌కు చోటు

ఆస్ట్రేలియా-ఏతో జరిగే మూడు వన్డేలకు ఇండియా-ఏ టీమ్‌ను BCCI ప్రకటించింది.
తొలి వన్డేకు(13 మంది): రజత్ పాటిదార్, ప్రభుసిమ్రన్, పరాగ్, బదోని, సూర్యాంశ్, విప్రజ్, నిశాంత్, గుర్జప్నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పొరెల్, ప్రియాంశ్, సిమర్జిత్ సింగ్.
2, 3 వన్డేలకు(15 మంది): ప్రియాంశ్, సిమర్జిత్ స్థానంలో తిలక్, అభిషేక్‌తో పాటు హర్షిత్, అర్ష్‌దీప్‌కు చోటు దక్కింది.
పూర్తి వివరాలకు ఇక్కడ <
News September 14, 2025
కాంగ్రెస్ వల్లే విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి: హరీశ్ రావు

TG: రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడం సిగ్గుచేటని BRS MLA హరీశ్ రావు ఫైరయ్యారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి నెలకొందన్నారు. రీయింబర్స్‌మెంట్, ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా ప్రాజెక్టులకు ₹కోట్ల టెండర్లు ఎలా పిలుస్తున్నారని ప్రశ్నించారు. ఇలానే కొనసాగితే తక్కువ కాలంలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిన విద్యాశాఖ మంత్రిగానూ రేవంత్ నిలిచిపోతారన్నారు.