News September 18, 2024
MSME పాలసీ పటిష్ఠం చేయాలని నిర్ణయం: డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్రంలో MSME పాలసీ పటిష్ఠం చేయాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా తెలంగాణలో MSME పాలసీ తీసుకొచ్చామని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ MSME పాలసీ లేదన్నారు. ఆర్థిక వ్యవస్థకు చిన్న, సూక్ష్మ పరిశ్రమలు కీలకమని చెప్పారు. భారీ పరిశ్రమలతో పాటు MSMEలకు తమ సర్కారు అనుకూల వాతావరణం కల్పిస్తామని పేర్కొన్నారు.
Similar News
News November 1, 2025
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్

వర్ష ప్రభావంతో వరద చేరే లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి శాశ్వత పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనుదీప్ అన్నారు. శనివారం మధిరలోని లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. పెద్దచెరువు బ్యాక్ వాటర్ ప్రభావం వలన లోతట్టు ప్రాంతాల వరద నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.
News November 1, 2025
కంప్యూటర్ల మరమ్మతుకు టెండర్లు దాఖలు చేయాలి: అ.కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని 84 ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్స్ మరమ్మతులకు NOV 6 లోపు టెండర్లు దాఖలు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. కంప్యూటర్ మరమ్మతుల నిమిత్తం 69 ఉన్నత పాఠశాలలకు రూ.15 వేలు చొప్పున, 15 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.11.10 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. ఆసక్తి గల వారు DEO కార్యాలయంలో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 1, 2025
క్షేత్రస్థాయి వాస్తవ నివేదికలు సిద్ధం చేయండి: కలెక్టర్

ఖమ్మం: మొంథా తుఫాన్ నష్టం అంచనాలపై శనివారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏదైనా తప్పుడు ఫిగర్ను ఇవ్వకూడదని, నష్టం జరిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పరిహారం అందేలా చూడాలని సూచించారు. అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా అంచనాలు తయారు చేయాలని అధికారులకు వివరించారు.


