News September 18, 2024
చిలుకను పట్టిస్తే రూ.10వేలు రివార్డు

తమ చిలుక సమాచారమిస్తే రూ.10వేలు రివార్డిస్తామంటూ అయోధ్యలో వెలిసిన పోస్టర్లు ఇంట్రెస్టింగా మారాయి. UP ఫైజాబాద్‌లోని శైలేశ్ కుమార్ ఈ ‘మిట్టూ’ చిలకను పెంచుకుంటున్నారు. 20 రోజుల క్రితం పొరపాటున పంజరం తెరవడంతో ఎగిరిపోయి ఇంటికి తిరిగి రాలేదన్నారు. తెలివైన, చక్కగా శిక్షణ పొందిన మిట్టూ మనుషుల గొంతును అనుకరించేదని, ఇంటికొచ్చిన గెస్టులను పేరుపెట్టి పిలిచేదన్నారు. దాని జాడ తెలీక వారి కుటుంబం వర్రీ అవుతోందట.
Similar News
News July 9, 2025
వరంగల్ నిట్‌లో తొలిసారిగా ఐ స్టెమ్ సమావేశం

వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ(నిట్)లో రాష్ట్రంలోనే తొలిసారిగా ఐ స్టెమ్ సమావేశం నిర్వహించారు. బుధవారం నిట్ ఆడిటోరియంలో భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ‘ఎంపవరింగ్ రీసెర్చ్ త్రూ షేర్డ్ సైన్టిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ అనే థీమ్‌తో సమావేశం నిర్వహించారు. అన్ని రంగాలకు సాంకేతికతను అందించడమే ఐ స్టెమ్ లక్ష్యం అని వక్తలు పేర్కొన్నారు.
News July 9, 2025
పెంపుడు కుక్క మీ జీవితకాలాన్ని పెంచుతుంది!

పెంపుడు కుక్కలున్న యజమానులు ఇతరులతో పోల్చితే రోజుకు 22ని.లు ఎక్కువగా నడుస్తారని లివర్‌పూర్ విశ్వవిద్యాలయ పరిశోధనలో వెల్లడైంది. ఇలా ఏటా మిలియన్ కంటే ఎక్కువ అడుగులు అదనంగా వేస్తారని తేలింది. యజమానులు కుక్క వేగానికి తగ్గట్లు నడిస్తే హైబీపీ& కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుందని పేర్కొంది. తద్వారా వారి జీవితకాలం పెరుగుతుంది. మీకూ పెంపుడు కుక్క ఉందా? కామెంట్ చేయండి.
News July 9, 2025
మూడో టెస్టుకు టీమ్ ప్రకటన.. స్టార్ పేసర్ రీఎంట్రీ

భారత్‌తో రేపటి నుంచి జరగనున్న మూడో టెస్టుకు ఇంగ్లండ్ ఒక్క మార్పుతో జట్టును ప్రకటించింది. జోష్ టంగ్ ప్లేస్‌లో స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. దీంతో ENG బౌలింగ్ అటాక్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. లార్డ్స్‌లో గ్రీన్ పిచ్ ఉండనుందన్న వార్తల నేపథ్యంలో ఆర్చర్ కీలకంగా మారనున్నారు.
ENG: క్రాలే, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, స్మిత్, వోక్స్, కార్స్, ఆర్చర్, బషీర్