News September 18, 2024
బాధితులకు వైఎస్ జగన్ ఆర్థిక సాయం

AP: ప్రత్యర్థుల దాడిలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆర్థిక సాయం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కాశీవారిపాకలకు చెందిన పోలవరపు లోవలక్ష్మికి రూ.లక్ష, వాసంశెట్టి శ్రీలక్ష్మికి రూ.50 వేల సాయం అందించారు. ఇటీవల జగన్ పిఠాపురం పర్యటనకు వెళ్లగా, బాధితులు ఆయనకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి సాయం చేయడంతోపాటు లీగల్ టీమ్ కూడా ఏర్పాటు చేశారు.
Similar News
News January 25, 2026
వివేక్ ఆత్రేయతో రవితేజ సినిమా?

సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహరాజా రవితేజ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొత్త తరహా కథలను తెరకెక్కించే వివేక్ ‘సరిపోదా శనివారం’ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు. రజినీకాంత్, సూర్యకు ఆయన స్టోరీ వినిపించారని అంతకుముందు ప్రచారం జరిగింది. కానీ అవి ఓకే కాలేదని తెలుస్తోంది. కాగా రవితేజ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు.
News January 25, 2026
నో కాస్ట్ EMI.. మీకు ఈ విషయాలు తెలుసా?

‘నో కాస్ట్ EMI’తో ఆన్‌లైన్‌లో వస్తువులు కొంటే వడ్డీ ఉండదని అనుకుంటాం. కానీ వస్తువు ధరలోనే వడ్డీ కలిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ‘నో కాస్ట్ EMI వల్ల భారీ డిస్కౌంట్లు కోల్పోతారు. అదనంగా ప్రాసెసింగ్ ఫీజు+GST కూడా చెల్లించాల్సి వస్తుంది. ఎక్కువ EMIల వల్ల క్రెడిట్ యుటిలైజేషన్ రేట్ పెరిగి సిబిల్ స్కోర్ తగ్గొచ్చు’ అని పేర్కొంటున్నారు. కొనేముందు అసలు ధరతో EMI ధర కంపేర్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
News January 25, 2026
UK ప్రధాని ఫైర్.. వెనక్కి తగ్గిన ట్రంప్!

అఫ్గాన్ యుద్ధంలో US మినహా ఇతర నాటో దేశాల సైనికులు సరిగా పోరాడలేదన్న ట్రంప్ వ్యాఖ్యలపై UK PM స్టార్మర్ <<18942081>>ఫైరయిన<<>> సంగతి తెలిసిందే. దీంతో UK ఆర్మీని ప్రశంసిస్తూ ట్రంప్ SMలో పోస్ట్ పెట్టారు. ‘UK సైనికులు ధైర్యవంతులు, గొప్పవారు. ఎప్పుడూ USతోనే ఉంటారు. ఈ బంధం ఎప్పటికీ విడిపోలేనంత బలమైనది. AFGలో 457 మంది UK సైనికులు చనిపోయారు. వారంతా గొప్ప యోధులు’ అని ట్రంప్ పేర్కొన్నారు.


