News September 18, 2024
ప.గో. జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ భేటీ
తాడేపల్లి పరిధిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ నేతలతో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బుధవారం సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చించారు. సమావేశంలో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 28, 2024
పగో జిల్లాకు ప్రత్యేక స్థానం దక్కాలి: కలెక్టర్
ప.గో జిల్లా కలెక్టర్ నాగరాణి గురువారం వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ మందిరంలో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విజన్-2047 డాక్యుమెంట్ రూపకల్పనతో జిల్లాకు ప్రత్యేక స్థానం దక్కాలని అధికారులకు సూచించారు. జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాల ప్రగతిపై ఆరా తీశారు. రోడ్డు గుంతల పూడ్చివేత, పల్లె పండుగలో చేపట్టిన రోడ్డు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి కావాలన్నారు.
News November 28, 2024
ఈవీఎం గోడౌన్ తనిఖీ: కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు కలెక్టరేట్‌లో ఉన్న ఈవీఎం యంత్రాలు, వివిప్యాట్‌లు భద్రపరిచే గోడౌన్‌ను గురువారం కలెక్టర్ కె.వెట్రిసెల్వి తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ తనిఖీ చేశారు. గోదాం తాళాలు, సిసి కెమెరాలు పనితీరు, అగ్నిమాపకదళ పరికరాలను పరిశీలించారు. అనంతరం సెక్యూరిటీ లాగ్ బుక్‌ను పరిశీలించి సంతకం చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
News November 28, 2024
వాటికి అనుమతులు తప్పనిసరి: ప.గో DMHO
ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, ఫిజియోథెరఫీ సెంటర్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్‌లు నిర్వహించడం నేరమని ప.గో జిల్లా DMHO డి.మహేశ్వరరావు హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు అన్నీ అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తే అనుమతులు ఇస్తామని చెప్పారు. ఆయా సెంటర్ల వద్ద పరీక్షల ఫీజు బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.