News September 18, 2024
చంద్రబాబుకి భయం లేదు: పవన్ కళ్యాణ్

AP: చంద్రబాబు నాయకత్వంలో పని చేయడం సంతోషంగా ఉందని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అన్నారు. NDA శాసనసభా పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘CM చంద్రబాబు దార్శనికుడు. ఆయనకు భయం లేదు. ముందుచూపు ఆలోచనలతో ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఎన్ని అవమానాలకు గురి చేసినా అధైర్యపడలేదు. CBNను జైలులో ఉంచినప్పుడు షూటింగ్ చేయలేకపోయా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెన్షన్లు పెంచాం. 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చాం’ అని తెలిపారు.
Similar News
News January 27, 2026
ఫిబ్రవరి తొలివారంలో రైతులకు రూ.2వేలు?

దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు శుభవార్త చెప్పేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అదే వారంలో పీఎం కిసాన్ పథకంలో భాగంగా అన్నదాతల ఖాతాల్లో రూ.2వేల చొప్పున జమ చేస్తుందని సమాచారం. మరోవైపు ఏపీ ప్రభుత్వం మరో రూ.4వేలు కలిపి మొత్తం రూ.6వేలను అన్నదాతలకు అందించే అవకాశం ఉంది. కాగా రైతులు తప్పనిసరిగా E-KYC చేయించుకోవాలి. లేదంటే డబ్బులు జమ కావు.
News January 27, 2026
లంకను గెలిచిన ఇంగ్లండ్.. సిరీస్ కైవసం

శ్రీలంకతో జరిగిన <<18976263>>మూడో వన్డేలో<<>> ఇంగ్లండ్ 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 358 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంక 46.4 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. పవన్ రత్ననాయకే 121, పాతుమ్ నిస్సాంక 50 మినహా అందరూ విఫలమయ్యారు. కాగా మూడు టీ20ల సిరీస్ జనవరి 30 నుంచి ప్రారంభమవుతుంది.
News January 27, 2026
MLA వ్యవహారంలో నిజమేంటో తేల్చాలి: శైలజ

AP: జనసేన MLA <<18975483>>అరవ శ్రీధర్<<>>పై SMలో వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. బాధితురాలితో ఫోన్లో మాట్లాడి ఘటనపై వివరాలు సేకరించినట్లు తెలిపారు. మహిళ గౌరవం, భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. ఘటనలో నిజానిజాలు తేల్చి బాధితురాలికి అండగా ఉంటామన్నారు. దీనిపై జనసేన అంతర్గత బృందం విచారణ జరిపి పవన్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


