News September 18, 2024
రేగిడి: సూసైడ్ లెటర్ రాసి విద్యార్థి ఆత్మహత్య

రేగడి ఆమదాలవలస అంబాడ వెంకటాపురం గ్రామానికి చెందిన గోగుల యోగేశ్వరరావు(20) బుధవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ముందు అతడు సూసైడ్ నోట్ రాసి పెట్టినట్లు ఎస్సై నీలావతి తెలిపారు. ‘దానిలో తాను కెరియర్లో సక్సెస్ అవ్వలేక పోతున్నా, కుటుంబ సభ్యులను ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ప్రయత్నించా, కానీ నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం అవుతున్నా’ అంటూ విద్యార్థి రాశాడు.
Similar News
News February 3, 2026
ఆక్వా రంగంపై అమెరికా నిర్ణయం స్వాగతిస్తున్నాం: అచ్చెన్నాయుడు

అమెరికా ప్రభుత్వం భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై విధించిన టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం తెలిపారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కింద ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్రంలోని సముద్ర ఆహార ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఆక్వా రంగానికి గణనీయమైన ఉపశమనం లభిస్తుందన్నారు. దీనివలన నిలిచిపోయిన కొత్త ఆర్డర్లకు మంచి అవకాశం ఉంటుందన్నారు.
News February 3, 2026
శ్రీకాకుళం: 2 నెలల్లో కుమార్తె పెళ్లి..అంతలోనే విషాదం

ఆమదాలవలస మండలం చీమలవలసకి చెందిన బొడ్డేపల్లి వెంకటలక్ష్మి(47) అనే మహిళని భోగాపురం వద్ద కారు ఢీకొని మృతి చెందింది. గత కొన్నేళ్లుగా క్రితం భర్త రమణమూర్తితో కలిసి భోగాపురంలో నివాసం ఉంటొంది. తన పెద్దకుమార్తె గాయత్రీకి మరో రెండు నెలల్లో వివాహం, పెళ్లి పనుల్లో కుటుంబసభ్యులు ఉండగా వెంకటలక్ష్మి ఈనెల 1వ తేదీ రాత్రి సర్వీసు రోడ్డు దాటుతుండగా విశాఖ వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది.
News February 3, 2026
శ్రీకాకుళం: ముగుస్తున్న సర్పంచ్‌ల పదవీ కాలం.. ఎన్నికలు జరుగుతాయా?

గ్రామపంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీ కాలం మరో రెండు నెలల్లో ముగుస్తుండడంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై గ్రామస్థాయిలో చర్చ మొదలైంది. ఇప్పటికే గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు ఫ్రీజింగ్‌లో ఉన్నాయి. జిల్లాలోని 912 గ్రామ పంచాయతీలు ఉండగా 2021 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. పది, ఇంటర్ పరీక్షలు, జన, కులగణన నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయా లేదా ప్రత్యేక అధికారులు వస్తారా అనే సందిగ్ధం నెలకొంది.


