News September 18, 2024

3 పార్టీలు శాశ్వతంగా కలిసి ఉండాలి: CBN

image

APలో గత ఐదేళ్లలో అభివృద్ధి ఆగిపోయిందని NDA శాసనసభాపక్ష సమావేశంలో CM చంద్రబాబు అన్నారు. ‘2047 నాటికి APలో పేదరికం లేకుండా చేస్తాం. 3పార్టీలు సమగ్ర కృషితో ఘన విజయం సాధించాం. రాష్ట్రాభివృద్ధికి కలిశాం.. మన కలయిక శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రజలు మెచ్చేలా మన పాలన ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు. చేసిన పనులు, చేయబోయే పనులు ప్రజలకు వివరించాలి. నియోజకవర్గాల్లో నేతలు విజన్‌తో ముందుకెళ్లాలి’ అని సూచించారు.

Similar News

News November 1, 2025

ఇక్కడ ఒకరాత్రి బస ఖర్చు ₹88 లక్షలు

image

ప్రపంచంలో అత్యంత ఖరీదైన హోటళ్లు అనేకం. వాటిలో జెనీవా(స్విట్జర్లాండ్‌)లోని ప్రెసిడెంట్ విల్సన్ ప్రత్యేకతే వేరు. ఇక్కడి పెంట్‌హౌస్ సూట్‌కు ఒకరాత్రి బస ఖర్చు ₹88 లక్షలు. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, 12 పడగ్గదులు ఉండే ఇందులో PA, చెఫ్, బట్లర్లు 24 గంటలు అందుబాటులో ఉంటారు. హైప్రొఫైల్ వ్యక్తులు ఇందులో దిగుతుంటారు. 8 అంతస్తుల ఈ హోటల్ నుంచి జెనీవా లేక్‌, ఆల్ప్స్ పర్వతాల మధ్య సన్‌సెట్ ఎంతో అనుభూతి ఇస్తుంది.

News November 1, 2025

రేపే ఫైనల్: అమ్మాయిలూ అదరగొట్టాలి

image

ఉమెన్స్ ODIWC ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ముంబై వేదికగా రేపు 3PMకు భారత్- సౌతాఫ్రికా మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీస్‌లో AUSను చిత్తు చేసిన జోష్‌లో ఉన్న IND.. ఫైనల్లోనూ గెలిచి తొలి WCను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. స్మృతి, జెమీమా, హర్మన్, రిచా, దీప్తి, చరణి, రాధ, రేణుక ఫామ్ కంటిన్యూ చేస్తే గెలుపు నల్లేరుపై నడకే. SA కెప్టెన్ లారా, నదినె, కాప్‌లతో INDకు ప్రమాదం పొంచి ఉంది.
* ALL THE BEST TEAM INDIA

News November 1, 2025

రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: రాష్ట్రంలో రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరులో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. వానలు పడే సమయంలో చెట్ల కింద నిలబడరాదని సూచించింది. కృష్ణా నదికి వరద తాకిడి ఉండటంతో పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.