News September 18, 2024

ట్రైనీ ఐపీఎస్‌గా నంద్యాల జిల్లా యువ ఐపీఎస్ మనీషా రెడ్డి

image

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఏపీకి నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించింది. నంద్యాల జిల్లా మహానంది మండలం నందిపల్లెకు చెందిన వంగల మనీషా రెడ్డి ఆ జాబితాలో ఉన్నారు. సొంత రాష్ట్రానికి ట్రైనీ ఐపీఎస్‌గా కేటాయించడంతో నందిపల్లి గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, పలువురు ఆనందం వ్యక్తం చేశారు.

Similar News

News January 6, 2026

రాయలసీమ పారిశ్రామికాభివృద్ధి బ్లూప్రింట్

image

రాయలసీమలోని అన్ని జిల్లాలు సమానంగా వృద్ధి చెందేలా సమగ్ర పారిశ్రామిక ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లాలో ఉన్న వనరులు, అవకాశాలను బట్టి ప్రత్యేక పారిశ్రామిక హబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి పెరగడమే కాకుండా ప్రాంతీయ అసమానతలు తొలగే అవకాశం ఉంది. జిల్లాల వారీగా పారిశ్రామిక ప్రాధాన్యతలు పై ఫొటోలో చూడొచ్చు. ఈ ప్రణాళిక సాకారం అయితే రాయలసీమ రతనాల సీమ కానుంది.

News January 6, 2026

కర్నూలు: ‘సంక్షేమ వసతి గృహాలు మెరుగ్గా పనిచేయాలి’

image

సంక్షేమ వసతి గృహాలు మెరుగ్గా పనిచేయాలని రాష్ట్ర BC వెల్ఫేర్ ఎక్స్‌-అఫీషియో కార్యదర్శి సత్యనారాయణ ఆదేశించారు. కర్నూలులోని సునయన ఆడిటోరియంలో మంగళవారం కర్నూలు, కడప, అనంతపురం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల చదువు, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు. 100% ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు.

News January 5, 2026

పీహెచ్సీలో వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

image

పీహెచ్సీలో వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ డా. ఏ.సిరి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌కు సంబంధించి చాలా అంశాలలో ప్రజల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందన్నారు. అయితే వైద్య ఆరోగ్యం, సర్వే, రెవెన్యూ అంశాల్లో ఇంకా కొంత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.