News September 18, 2024

BREAKING: 2050 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

TG: 2050 నర్సింగ్ ఆఫీసర్స్(స్టాఫ్ నర్స్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 17న CBT విధానంలో పరీక్ష జరుగుతుంది. ఎంపికైన వారికి రూ.36,750-1,06,990 పేస్కేల్ విధానంలో జీతం చెల్లిస్తారు. GNM లేదా బీఎస్సీ(నర్సింగ్) అర్హత ఉన్న 18 నుంచి 46 ఏళ్లలోపు వారు అర్హులు. పూర్తి నోటిఫికేషన్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News January 17, 2026

కరీంనగర్: చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలి: కలెక్టర్‌

image

స్థానిక బాల సదనంకు చెందిన తొమ్మిది, పన్నెండేళ్ల వయసున్న ఇద్దరు బాలికలను హైదరాబాద్‌కు చెందిన దంపతులకు జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంతానం లేని వారు చట్టబద్ధంగా మాత్రమే దత్తత తీసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు జిల్లా సంక్షేమ అధికారిని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

News January 17, 2026

ఈ స్కీమ్ గురించి తెలుసా? ఆధార్ కార్డుతో రూ.90వేల లోన్

image

వీధి వ్యాపారులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం ‘ప్రధానమంత్రి స్వనిధి’ అనే మైక్రో క్రెడిట్ స్కీమ్‌ను అందిస్తోంది. ఎటువంటి తాకట్టు లేకుండా 3 విడతల్లో రూ.90వేల లోన్ ఇస్తారు. ఆధార్ కార్డుతో ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో అప్లై చేసుకోవచ్చు. రుణాన్ని క్రమం తప్పకుండా చెల్లించే వ్యాపారులకు ఏడాదికి 7% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. 2030 మార్చి 31 వరకు ఈ పథకం అందుబాటులో ఉండనుంది.
Share It

News January 17, 2026

DRDOలో JRF, RA పోస్టులు

image

<>DRDO<<>>కు చెందిన డిఫెన్స్ మెటీరియల్స్ & స్టోర్స్ రీసెర్చ్& డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DMSRDE) 3 పోస్టులను భర్తీ చేయనుంది. PhD(కెమిస్ట్రీ), పీజీ, బీఈ, బీటెక్/ ఎంఈ, ఎంటెక్, NET, GATE అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 12న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. JRFకు గరిష్ఠ వయసు 28ఏళ్లు కాగా, రీసెర్చ్ అసోసియేట్‌కు 35ఏళ్లు. RAకు స్టైపెండ్ నెలకు రూ.67వేలు, JRFకు 37వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.drdo.gov.in