News September 18, 2024
ప్రకాశం: ‘సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

ఫేక్ ప్రొఫైల్ DPలతో అపరిచిత ఫోన్ నంబర్ల నుంచి వచ్చే నగదు అభ్యర్థనలకు స్పందించవద్దని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ బుధవారం తెలిపారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే సైబర్ క్రైమ్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదుచేయాలని సూచించారు. స్నేహితుల ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ల DPలుగా పెట్టుకొని మోసాలకు పాల్పడతారని, అటువంటి వారిపై జాగ్రత్తగా ఉండాలన్నారు.
Similar News
News November 13, 2025
విద్యుత్తు అధికారులు నిర్లక్ష్యంగా ఉండరాదు: CMD

ఒంగోలులోని విద్యుత్ భవన్‌లో APSPDCL సీఎండీ పుల్లారెడ్డి గురువారం కీలక సమావేశం నిర్వహించారు. ఆర్డీఎస్ఎస్, పీఎం సూర్య ఘర్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, స్మార్ట్ మీటర్ల గురించి చర్చించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయరాదని అధికారులకు సూచించారు. జిల్లాలో సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్లు అధికంగా ఏర్పాటు చేసేలా ప్రతి అధికారి ఓ లక్ష్యాన్ని పెట్టుకోవాలన్నారు.
News November 13, 2025
మద్దిపాడు యువకుడిపై.. మార్కాపురంలో పోక్సో కేసు

మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు మార్కాపురం ఎస్సై సైదుబాబు తెలిపారు. మార్కాపురానికి చెందిన బాలికను మద్దిపాడుకు చెందిన ఓ యువకుడు రెండు రోజుల కిందట తీసుకువెళ్లినట్లు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
News November 13, 2025
ప్రకాశం జిల్లాలో 14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జరిగే గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్‌లో బుధవారం వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థుల్లో గ్రంథాలయాల ప్రాముఖ్యతపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.


