News September 18, 2024
శ్రీలంక క్రికెటర్ అరుదైన ఘనత

టెస్టుల్లో శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్ అరుదైన ఘనత సాధించారు. టెస్టుల్లో 80.90 యావరేజ్ కలిగిన రెండో బ్యాటర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. అగ్ర స్థానంలో బ్రాడ్‌మన్ (99.94) ఉన్నారు. మూడో స్థానంలో జైస్వాల్ (68.53) కొనసాగుతున్నారు. మెండిస్ తానాడిన తొలి 7 టెస్టుల్లోనే 4 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలతో 809 రన్స్ సాధించారు. కనీసం 10 ఇన్నింగ్స్‌లు ఆడిన వారిలో అత్యధిక పరుగులు చేసిన ఏడో ప్లేయర్‌గానూ నిలిచారు.
Similar News
News February 4, 2026
U19 WC: భారత్ రికార్డు

అండర్-19 మెన్స్ వరల్డ్ కప్‌లో భారత్ డామినేషన్ కొనసాగుతోంది. టీమ్ ఇండియా ఫైనల్ చేరడం U19 WC చరిత్రలో ఇది పదో సారి. దీంతో మొత్తం 16 ఎడిషన్లలో అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఇవాళ SF-2లో AFGపై 311 పరుగులు ఛేదించగా, U19 WC హిస్టరీలో ఇదే హయ్యెస్ట్ సక్సెస్‌ఫుల్ రన్ ఛేజ్. మరోవైపు వరుసగా 6 ఎడిషన్లలో (2016, 18, 20, 22, 24, 26) భారత్ ఫైనల్ చేరడం విశేషం.
News February 4, 2026
‘మన మిత్ర’కు 50 లక్షల మంది యూజర్లు

AP: ‘మనమిత్ర’ పేరుతో ప్రభుత్వం తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్‌కు ఆదరణ పెరుగుతోంది. 50 లక్షల మంది దీని ద్వారా సేవలందుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 900 సేవలందిస్తుండగా త్వరలోనే 1000కి పెంచనున్నారు. పాస్ పుస్తకాలు, ఆలయ సేవలు, బస్ టికెట్ల బుకింగ్, పన్నులు, బిల్లుల చెల్లింపులను ఈ యాప్‌తో చేసేయొచ్చు. 9552300009 నంబర్‌తోని ఈ యాప్ ప్రతి ఇంటి చిరునామాగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు.
News February 4, 2026
చెత్త ఏరుకునే వారిలో SCలే అధికం: కేంద్రం

సామాజికంగా వెనుకబడిన వర్గాల స్థితిగతులపై కేంద్రం చేపట్టిన సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో 1.52 లక్షల మంది చెత్త ఏరుకునేవారు ఉన్నారని, వీరిలో దాదాపు 84.5% మంది SC, ST, OBC సామాజిక వర్గాలకు చెందినవారేనని తేలింది. వీరిలో SCలు 60.3%, OBCలు 13.7%, OCలు 10.7%, STలు 10.5% ఉన్నారు. వీరందరికీ సంక్షేమ పథకాలు, బీమా సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను సేకరించింది.


