News September 19, 2024
యాదాద్రి ఎన్నికల ప్రధాన అధికారి సమీక్ష

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నేడు యాదాద్రి జిల్లా కలెక్టరు కార్యాలయంలో జిల్లా కలెక్టరు హనుమంత్‌తో ఇంటింటి సర్వే ద్వారా చేపడుతున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని మండలాల వారిగా సమీక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని సర్వే చేయాలని, పక్కాగా పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బెన్షాలోమ్, గంగాధర్ పాల్గొన్నారు.
Similar News
News January 20, 2026
NLG: మున్సిపల్ పోరు.. పెరగనున్న మహిళల ప్రాతినిధ్యం

మున్సిపల్ ఎన్నికల వేళ ఛైర్మన్ స్థానాల రిజర్వేషన్ల లెక్కలు మారాయి. ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది మహిళలకు అవకాశం దక్కనుంది. ముఖ్యంగా జనరల్ మహిళా స్థానాలు 5 నుంచి 7కు పెరగడం విశేషం. అయితే, బీసీ మహిళలకు మాత్రం ఈసారి నిరాశే ఎదురైంది. గతంలో 3 స్థానాలుండగా ఈసారి వాటిని 2కే పరిమితం చేశారు. ఇక SC మహిళలకు గతంలో లాగే ఒక స్థానాన్ని కేటాయించారు. ఈ మార్పులు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికపై ప్రభావం చూపనున్నాయి.
News January 19, 2026
నల్గొండ: మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు

నల్గొండ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల పరిధిలో మహిళా సంఘాలకు రూ.11.38 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా రుణాల పంపిణీ, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని కలెక్టర్ వివరించారు.
News January 19, 2026
నల్గొండ: ఇంటర్ కాలేజీలకు నిధులు మంజూరు

నల్గొండ జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సైన్స్ ప్రాక్టికల్ పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో కళాశాలకు రూ.50,000 చొప్పున మొత్తం రూ.6.50 లక్షలను కేటాయించింది. ఈ పరికరాల సరఫరా కోసం అర్హులైన సంస్థల నుండి కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి తెలిపారు. ఆసక్తి గల వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


