News September 19, 2024
ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై పోలీసులకు గంగూలీ ఫిర్యాదు

తనను నెట్టింట ట్రోల్ చేస్తున్న ఓ వ్యక్తిపై చర్యల్ని కోరుతూ మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కోల్‌కతా పోలీసుల్ని ఆశ్రయించారు. ‘మృణ్మయ్ దాస్ అనే వ్యక్తి నన్ను లక్ష్యంగా చేసుకుని దూషిస్తూ కించపరిచే వ్యాఖ్యలతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోంది. దయచేసి వెంటనే అతడిపై చర్యలు తీసుకోండి’ అని గంగూలీ కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Similar News
News November 15, 2025
బహిరంగ ప్రకటన లేకుండా గిఫ్ట్ డీడ్.. పరకామణిలో చోరీపై సీఐడీ

AP: పరకామణిలో చోరీ కేసులో నిందితుడు రవికుమార్ టీటీడీకి ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌పై బహిరంగ ప్రకటన ఎందుకు ఇవ్వలేదని జేఈవో వీరబ్రహ్మంను సీఐడీ ప్రశ్నించింది. టీటీడీకి రూ.14.43 కోట్ల విలువైన ఆస్తులను నిందితుడు గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చారు. ఇష్టప్రకారమే ఇచ్చారా? ఒత్తిడి చేశారా అని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకున్నప్పుడు ఎన్ని నోట్లు దొరికాయి, ఆరోజు లెక్కింపునకు వచ్చిన భక్తుల వివరాలు సేకరిస్తున్నారు.
News November 15, 2025
స్వామి పుష్కరిణి అని పేరెందుకు వచ్చింది?

తిరుమలలోని స్వామి పుష్కరిణికి ఆ పేరు రావడానికి ఓ పురాణ కథనం ప్రాచుర్యంలో ఉంది. వేంకటాచలంలో ఉన్న మూడు కోట్ల తీర్థాలన్నింటికీ ఈ పుష్కరిణియే అవతార స్థానం. లోకంలోని తీర్థాలన్నింటిలోనూ దీన్ని స్వామి వంటిదిగా పరిగణిస్తారు. వరాహ, వామన పురాణాల ప్రకారం.. తనలో స్నానం చేసిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదించగల శక్తి, పవిత్రతను అందిస్తుందట. అందుకే దీనికి స్వామి పుష్కరిణి అనే పేరు స్థిరపడింది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 15, 2025
APPLY NOW: CWCలో 22 పోస్టులు

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్(CWC)లో 22 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cwceportal.com/


