News September 19, 2024
మస్క్ ఉపగ్రహాలు పరిశోధనకు అడ్డు: పరిశోధకులు

ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ వేలాదిగా స్టార్‌లింక్ ఉపగ్రహాల్ని ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. భూమి చుట్టూ గొలుసుకట్టులా తిరిగే ఇవి ఖగోళ పరిశోధన, పరిశీలనలకు అడ్డు వస్తున్నాయని నెదర్లాండ్స్ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ఉపగ్రహాలకంటే స్టార్‌లింక్ శాటిలైట్స్ 32 రెట్లు అధికంగా రేడియో తరంగాలను వెలువరిస్తున్నాయని, రేడియో టెలిస్కోప్ పనితీరుకు అది సమస్య అవుతోందని వివరించారు.
Similar News
News October 30, 2025
సెంచరీ భాగస్వామ్యం.. ఉత్కంఠగా మ్యాచ్

WWCలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో టీమ్‌ఇండియా బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్(81*), హర్మన్ ప్రీత్(66*) అర్ధసెంచరీలు చేశారు. 59 పరుగులకే ఓపెనర్లు ఔటవ్వగా వీరిద్దరు సెంచరీ భాగస్వామ్యంతో జట్టును పటిష్ఠ స్థితిలోకి చేర్చారు. ప్రస్తుతం భారత్ స్కోరు 198/2. విజయానికి ఇంకా 19 ఓవర్లలో 141 పరుగులు చేయాల్సి ఉంది. ఎలాగైనా ఈ మ్యాచులో భారత్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News October 30, 2025
ముంబై కిడ్నాప్.. ఆ 35 నిమిషాలు ఏం జరిగింది?

ముంబై <<18151381>>కిడ్నాప్ <<>>ఘటనలో క్విక్ రియాక్షన్ టీమ్ 35 నిమిషాల ఆపరేషన్ నిర్వహించింది. 8మంది కమాండర్ల టీమ్ బాత్రూమ్ ద్వారా స్టూడియోలోకి వెళ్లింది. తొలుత నిందితుడు రోహిత్‌తో చర్చలు జరిపింది. కానీ లోపలికొస్తే షూట్ చేస్తానని, గదిని తగలబెడతానని అతడు బెదిరించాడు. తర్వాత ఫైరింగ్ స్టార్ట్ చేయడంతో రోహిత్‌పై లీడ్ కమాండో కాల్పులు జరిపి గాయపరిచారు. అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించగా అక్కడ రోహిత్ చనిపోయాడు.
News October 30, 2025
ఇదేందయ్యా ఇదీ.. బంగారు నగలు ధరిస్తే రూ.50వేలు ఫైన్

మన దేశంలో బంగారు ఆభరణాలు ధరించడమంటే ఇష్టపడని వారుండరు. కానీ ఉత్తరాఖండ్‌లోని జౌన్సర్-బావర్ ప్రాంతంలో ఉన్న కంధర్ గ్రామ నివాసితులు వింత నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా అసమానతలు తగ్గించేందుకు ఒంటినిండా నగలు ధరిస్తే రూ.50వేలు జరిమానా విధించాలని గ్రామపెద్దలు నిర్ణయించారు. మహిళలు సైతం దీనికి అంగీకారం తెలిపారు. శుభకార్యాల్లో చెవిపోగులు, ముక్కుపుడక, మంగళసూత్రం మాత్రమే ధరించాలనే నిబంధన విధించారు.


