News September 19, 2024

వేమన నీతి పద్యం- తాత్పర్యం

image

కర్మ మధికమైన గడచి పోవగరాదు
ధర్మరాజు దెచ్చి తగని చోట
గంకుభట్టు జేసెగటకటా దైవంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. ప్రతికూల సమయం వచ్చినప్పుడు ధర్మరాజు కూడా విరాట రాజువద్ద కంకుభట్టు వేషాన్ని ధరించాల్సి వచ్చింది.

Similar News

News September 20, 2024

సెప్టెంబర్ 20: చరిత్రలో ఈ రోజు

image

✒ 1924: ప్రముఖ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జననం
✒ 1933: హోంరూల్ ఉద్యమ నేత అనీ బిసెంట్ మరణం
✒ 1949: బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ పుట్టినరోజు
✒ 1954: ప్రముఖ కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం జననం
✒ 1999: తమిళ నటి టి.ఆర్.రాజకుమారి మరణం
✒ రైల్వే భద్రతా దళ(RPF) వ్యవస్థాపక దినోత్సవం

News September 20, 2024

నేను రాహుల్ గాంధీ వదిలిన బీసీ బాణాన్ని: మహేశ్‌కుమార్ గౌడ్

image

TG: దేశంలోని SC, ST, BC, మైనార్టీలకు న్యాయం జరగాలని పోరాడుతున్న మహానుభావుడు రాహుల్ గాంధీ అని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కొనియాడారు. అందుకే ఆయన్ను చంపుతామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తాను రాహుల్ వదలిన బీసీ బాణాన్ని అని చెప్పారు. కులగణన చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. BRS ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను 42 నుంచి 23 శాతం తగ్గించిందని దుయ్యబట్టారు.

News September 20, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.