News September 19, 2024
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక.. టీడీపీలో పోటీ

AP: రెండు గ్రాడ్యుయేట్ MLC స్థానాలకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో TDP అభ్యర్థిత్వం కోసం గట్టి పోటీ నెలకొంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు స్థానానికి ఆలపాటి రాజేంద్ర, దేవినేని ఉమ, తాళ్ల వెంకటేశ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఆలపాటికే సీటు ఖాయమైనట్లు సమాచారం. ఇక ఉభయగోదావరి జిల్లాల స్థానానికి కేఎస్ జవహర్, బొడ్డు వెంకట రమణ, పేరాబత్తుల రాజశేఖర్, మంతెన రామరాజు టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 13, 2025
రేపే దాయాదుల పోరు.. సగం టికెట్లే సేల్!

UAEలో జరుగుతోన్న ఆసియా కప్‌పై భారత అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోయింది. ముఖ్యంగా రేపు జరిగే ఇండియా VS పాకిస్థాన్‌ను బైకాట్ చేయాలంటూ భారత అభిమానులు పోస్టులు పెడుతున్నారు. దీంతో హాట్ కేకుల్లా అమ్ముడవ్వాల్సిన దాయాదుల మ్యాచ్ టికెట్లు ఇప్పటికీ సగం కూడా అమ్ముడవలేదని సమాచారం. అమ్మకాలను పెంచేందుకు నిర్వాహకులు టికెట్ ధరలు కూడా తగ్గించారట. రోహిత్, కోహ్లీ వంటి స్టార్లు లేకపోవడం మరో కారణంగా తెలుస్తోంది.
News September 13, 2025
నిద్రలోనే చనిపోయిన 19 మంది స్టూడెంట్స్

మయన్మార్‌లో అంతర్గత ఘర్షణలకు 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి రఖై రాష్ట్రంలోని క్యాక్తాలో రెండు ప్రైవేట్ స్కూళ్లపై డ్రోన్ల దాడి జరగడంతో 19 మంది స్టూడెంట్స్ నిద్రలోనే కన్నుమూశారు. 22 మంది గాయపడినట్లు అరాకన్ ఆర్మీ తెలిపింది. డ్రోన్లతో బాంబులను జారవిడిచారని, ఇది మయన్మార్ మిలిటరీ పనేనని ఆరోపించింది. కాగా కొన్నాళ్లుగా అరాకన్ ఆర్మీ, మయన్మార్ మిలిటరీ మధ్య ఘర్షణ జరుగుతోంది.
News September 13, 2025
‘నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపా.. నగరాజ ధరుడా శ్రీనారాయణా’ అంటే అర్థమేంటి?

అన్నమయ్య రచించిన ఓ ప్రముఖ కీర్తనలోని ఈ పంక్తులకు.. ‘వేదాలు(నిగమ), ఉపనిషత్తుల(నిగమాంత) ద్వారా వర్ణించబడిన అత్యంత మనోహరమైన రూపాన్ని కలిగి ఉన్నవాడా, ఓ శ్రీ నారాయణా! నీవు గొప్ప పర్వతాలు మోసినవాడవు(నగరాజ ధరుడా!)’ అనే అర్థం వస్తుంది. శ్రీమహావిష్ణువు కృష్ణుడి అవతారంలో గోవర్ధన గిరిని, క్షీరసాగర మథన సమయంలో కూర్మావతారంలో మందర పర్వతాన్ని మోశాడు. అలా నగరాజ ధరుడిగా ఆయణ్ను కొలుస్తారు.