News September 19, 2024

బూచేపల్లికి వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి.?

image

దర్శి MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు ప్రకాశం జిల్లా వైసీపీ పెద్దగా వ్యవహరించిన బాలినేని అనూహ్యంగా రాజీనామా ప్రకటించారు. దీంతో జిల్లా బాధ్యతలు ఎవరు చేపడతారా? అనే చర్చ కొనసాగుతోంది. వైవీ సుబ్బారెడ్డి రాష్ట్రస్థాయిలో కీలకంగా ఉండటంతో బూచేపల్లికే అధ్యక్ష పదవి వస్తుందని భావిస్తున్నారు.

Similar News

News November 26, 2024

నేడు మాగుంట సుబ్బరామరెడ్డి 77వ జన్మదినం

image

ప్రకాశం జిల్లాలో తమకంటూ ఓ ముద్ర వేసుకున్న వ్యక్తి మాగుంట సుబ్బరామరెడ్డి. నేడు ఆయన 77వ జన్మదినం. ఒంగోలు MPగా ఆయన పేదలకు ఉచిత మంచినీటి సరఫరా, ఆలయ నిర్మాణాలు, కళాశాలల నిర్మాణాలు వంటి ఎన్నో కార్యక్రమాలు ఇప్పటికీ ఆయనను గుర్తు చేస్తూనే ఉంటాయి. అయితే డిసెంబరు 1, 1995(PWG) నక్సలైట్ల దాడిలో ఆయన మృతి చెందారు. సతీమణి పార్వతమ్మ ఒంగోలు MP, MLAగా పనిచేశారు. సోదరుడు శ్రీనివాసులరెడ్డి ప్రస్తుత MPగా ఉన్నారు.

News November 26, 2024

IPL వేలంలో ప్రకాశం కుర్రాడికి నిరాశ.!

image

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న దోర్నాలకు చెందిన యంగ్ క్రికెటర్ మనీశ్ రెడ్డి ఐపీఎల్ వేలంలో అన్ సోల్డ్ అయ్యారు. జెడ్డాలో రెండ్రోజుల పాటు జరిగిన వేలంలో మనీశ్‌ను దక్కించుకునేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపలేదు. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోగా నిరాశే ఎదురైంది. ఈ విషయంపై మీరేమంటారో కామెంట్ చేయండి.

News November 25, 2024

విలువలు లేని రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు: బాలినేని

image

తాను విలువలు లేని రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ” YSR మరణించాక మంత్రి, MLA పదవులు వదులుకున్నానన్నారు. చంద్రబాబు, పవన్ మెప్పు కోసమే నేను మాట్లాడుతున్నానని కొందరు అనడం సమంజసం కాదన్నారు. ఎవరి మెప్పు కోసమో నేను పనిచేయట్లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. YSR కుటుంబం అంటే ఒక్క జగనేనా.? ఏ షర్మిల, విజయమ్మ కాదా అని బాలినేని ప్రశ్నించారు.