News September 19, 2024
మళ్లీ థియేటర్లలోకి ‘జర్నీ’

శర్వానంద్-అనన్య, జై-అంజలి నటించిన ‘జర్నీ’ మూవీ మరోసారి థియేటర్లలో అలరించనుంది. ఈ నెల 21న రీరిలీజ్ చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. శరవణన్ డైరెక్షన్‌లో తమిళంలో ‘ఎంగేయుమ్ ఎప్పోదుమ్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా 2011 సెప్టెంబర్‌లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. అదే ఏడాది డిసెంబర్‌లో తెలుగులో రిలీజ్ చేయగా, ఇక్కడా హిట్టయ్యింది.
Similar News
News December 28, 2025
ప్రముఖ ఫ్రెంచ్ నటి కన్నుమూత

ప్రముఖ ఫ్రెంచ్ నటి బ్రిగిట్టే బార్డోట్(91) మరణించారు. నటి, మోడల్, సింగర్‌గా ఆమెకు గుర్తింపు ఉంది. యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నారు. సదరన్ ఫ్రాన్స్‌లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గతనెల అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆమె వృద్ధాప్య సమస్యలతోనే మరణించి ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
News December 28, 2025
పని గంటలు కాదు.. శ్రద్ధ ముఖ్యం: ఇన్ఫోసిస్ కో-ఫౌండర్

ఎన్ని గంటలు పని చేశామనే దానికంటే ఎంత శ్రద్ధగా పనిచేశామనేది ముఖ్యమని ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎస్‌డీ శిబులాల్ అన్నారు. ‘పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు టైమ్ కేటాయించేందుకు ప్రతి ఒక్కరికీ ఛాన్స్ ఉంటుంది. కేటాయించిన టైమ్‌లో 100% ఫోకస్డ్‌గా ఉండాలి. సమయపాలనలో ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్‌లు వారికి ఉంటాయి’ అని చెప్పారు. వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కామెంట్ చేసిన విషయం తెలిసిందే.
News December 28, 2025
పసిపిల్లలకు ఫుడ్ అలవాటు చేసేముందు

ఘనాహారం అలవాటు చేసే ముందు పిల్లలకు పెట్టే ఏ ఆహారమైనా వారి శరీరానికి సరిపడుతుందో, లేదో ఒక్కసారి పరిశీలించాలంటున్నారు నిపుణులు. ముందుగా కొద్ది మొత్తాల్లో వారికి పెట్టి చూడాలి. దీంతో అలర్జీల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే వారికి పెట్టే ఆహారం విషయంలో ఎలాంటి సందేహాలున్నా సంబంధిత నిపుణుల సలహా తీసుకొని వారిచ్చిన న్యూట్రిషన్ ఛార్ట్ ఫాలో అయితే మీ చిన్నారికి చక్కటి పోషకాహారం అందుతుందంటున్నారు.


