News September 19, 2024

KU: 26 వరకు డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు

image

KU పరిధిలో డిగ్రీ మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు. ఫీజు చెల్లించడానికి ఈ నెల 26 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆలస్య రుసుముతో అక్టోబర్ 4 వరకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సకాలంలో ఫీజు చెల్లించాలన్నారు.

Similar News

News October 3, 2024

గ్రామాల్లో ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు

image

ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న పూల పండుగ(బతుకమ్మ) సంబురాలు రానే వచ్చాయి. దీంతో గ్రామాలు సందడిగా మారాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించుకునే  బతుకమ్మ సంబరాల్లో భాగంగా తీరొక్క పూలతో  బతుకమ్మలను  భక్తిశ్రద్ధలతో పేర్చి రోజుకో నైవేద్యాన్ని  బతుకమ్మకు సమర్పిస్తారు. బతుకమ్మ సంబరాలు దుమ్ముగూడెం మండలంలో  మొదటిరోజు ఎంగిలిపువ్వు  బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో అట్టహాసంగా ముగుస్తాయి.

News October 3, 2024

కొత్తగూడెం: ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. ఇద్దరు మృతి

image

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆళ్లపల్లి మండలం లక్ష్మిపురానికి చెందిన ప్రవీణ్, ప్రణయ్ కలిసి బుధవారం బైక్‌పై అనంతొగుకి వెళ్లారు. మర్కోడు నుంచి కొత్తగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులు 108కు సమాచారం ఇవ్వడంతో వెంటనే కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు.

News October 3, 2024

ఖమ్మం: గాలి వాన బీభత్సం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ వర్షాలు కురిశాయి. సాయంత్రం మొదలైన వాన రాత్రి వరకూ కురిసింది. గాలి బీభత్సానికి కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేలకొండపల్లి మండలం బైరంపల్లిలో పెద్ద గాలికి చెట్టు విరిగి గేదెపై పడింది. అనాసాగరం- పమ్మి శివారులో భారీ వృక్షం పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వైర్లు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.