News September 19, 2024
చిత్తూరు: 66 మంది డీటీలు ట్రాన్స్ ఫర్

చిత్తూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 66 మంది డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్న 25 మంది డీటీలు, రీసర్వే డీటీలు 26 మంది, ఎన్నికల డీటీలు నలుగురు, ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న డీటీలు ఐదుగురు, డీఎస్వో కార్యాలయంలో పనిచేస్తున్న ఆరుగుర్ని బదిలీచేశారు. అలాగే 17 మంది వీఆర్వోలు బదిలీ అయ్యారు.
Similar News
News February 1, 2026
పుత్తూరు: హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

తిరుపతి–చెన్నై జాతీయ రహదారిపై గోవిందపాళ్యం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాత,మనవడు మృతి చెందారు. ప్రమాద హెచ్చరిక సూచిక బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు లేకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. బైక్‌ని బొలెరో ఢీకొనడంతో కళాప్పన్ (65) అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన మనవడు విజయన్ (32) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 1, 2026
జాతీయస్థాయి కోకో జట్టుకు తీర్థం విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి ఖోఖో జట్టుకు తీర్థం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్ఎం లక్ష్మీపతి తెలిపారు. జనవరి 22న జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన గంగాధర్, యశ్వంతి పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచారు. దీంతో వారు హర్యానాలో జరగనున్న జాతీయస్థాయి 35వ సబ్ జూనియర్ ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని HM, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
News February 1, 2026
CM చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు

CM చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం పర్యటనలో పార్టీ క్యాడర్‌తో సమావేశం మాత్రమే ఉండగా.. మధ్యాహ్నం 2 గం.తర్వాత CM తిరుగు ప్రయాణం కావలసి ఉంది. అయితే క్యాడర్‌తో సమావేశాల తర్వాత ఇంటికి వెళ్లి అక్కడ నుంచి అబకల దొడ్డిలో సంజీవని కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 4:40 గం.కు తుమిసి హెలిప్యాడ్ నుంచి HYD వెళ్లనున్నారు.


