News September 19, 2024

తరగతి గదిలోకి టీచర్లు ఫోన్ తీసుకెళ్తే కఠిన చర్యలు

image

TG: క్లాస్ రూమ్‌లోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లొద్దనే ఆదేశాలున్నా కొందరు టీచర్ల తీరు మారట్లేదు. ఇటీవల కలెక్టర్ల ఆకస్మిక తనిఖీల్లో పలువురు ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌లోనే సమయం గడుపుతూ కనిపించారు. దీంతో విద్యాశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తరగతి గదిలోకి ఫోన్ తీసుకెళ్లొద్దని, అత్యవసరమైతే HM అనుమతి తీసుకోవాలని పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Similar News

News November 8, 2025

ఇది రాజమౌళి మార్క్ కాదు.. పోస్టర్‌పై ఫ్యాన్స్ నిరాశ

image

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న SSMB 29 సినిమా నుంచి నిన్న విడుదలైన పోస్టర్ నిరాశపరిచిందని ఫ్యాన్స్ అంటున్నారు. విలన్ పృథ్వీ సుకుమారన్ వీల్ ఛైర్‌లో కూర్చున్నట్లు ఆ పోస్టర్ ఉంది. అయితే గతంలో వచ్చిన సూర్య ’24’లో అచ్చం ఇదే లుక్ ఉందని, ఇది రాజమౌళి మార్క్ కాదని పోస్టులు చేస్తున్నారు. చూడ్డానికి AI జనరేటెడ్ పిక్‌లా ఉందంటున్నారు. మరి ఈ పోస్టర్ మీకు నచ్చిందా? కామెంట్ చేయండి.

News November 8, 2025

NEEPCLలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

image

నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (<>NEEPCL<<>>) 30ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్ -2025 స్కోరు సాధించిన వారు ఈ నెల 17వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.50వేల నుంచి రూ.1,60,000 వరకు జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://neepco.co.in

News November 8, 2025

ఉప్పుడు బియ్యానికి అనుకూలమైన వరి రకం

image

ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా సాగు చేసే రకం M.T.U 3626(ప్రభాత్). ఈ వరి రకం పంట కాలం 120 నుంచి 125 రోజులు. గింజ పొడవు మరియు ముతక రకం. ఈ రకం చేనుపై పడిపోదు. అగ్గి తెగులును తట్టుకుంటుంది. M.T.U 3626 వరి రకం ఉప్పుడు బియ్యం, నూకకు అత్యంత అనుకూలం. ఎకరాకు 3 నుంచి 3.5 టన్నుల దిగుబడినిస్తుందని వ్యవసాయ నిపుణులు తెలిపారు.