News September 19, 2024

HYD: నవోదయ ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు పొడిగింపు

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గచ్చిబౌలి నవోదయ విద్యాలయం ప్రధానాచార్యుడు డి.విజయ్ భాస్కర్ శుభవార్త చెప్పారు. జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష గడువును పొడిగించినట్లు వెల్లడించారు. జనవరి 18న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు దరఖాస్తు గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించారు. ఆన్‌లైన్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Similar News

News November 8, 2025

HYD: ఫైర్, హెల్త్ సేఫ్టీ కోర్సుల్లో శిక్షణ

image

నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్, హెల్త్ సేఫ్టీ, ఎన్విరాన్‌మెంట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఆమోదిత ఫైర్, హెల్త్ సేఫ్టీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎ.విమలా రెడ్డి తెలిపారు. ఫైర్, ఇండస్ట్రీయల్, హెల్త్ సేఫ్టీ కోర్సుల్లో డిప్లొమా, పీజీ డిప్లొమా, ఎన్విరాన్‌మెంట్ కోర్సులో మాస్టర్ డిప్లొమాలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

News November 8, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: రేపు సాయంత్రం నుంచి ప్రచారం బంద్

image

జూబ్లీహిల్స్ బైపోల్‌ ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపు సాయంత్రం వరకు ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంది. EC నిబంధనల ప్రకారం సాయంత్రం తర్వాత మైకులు బంద్ చేయాలి. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి వైన్స్ కూడా మూతబడనున్నాయి. నవంబర్ 11న పోలింగ్ ఉండడంతో ఓటర్లకు గాలం వేసేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. గెలుపు ఓటముల్లో పోల్ మేనేజ్‌మెంట్ కీలకం కానుంది.

News November 8, 2025

HYD: ముఖ్యమంత్రి ప్రజావాణిలో 285 దరఖాస్తులు

image

బేగంపేటలోని ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణిలో మొత్తం 285 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 154, రెవెన్యూకు 25, హోం శాఖకు 17, ఇందిరమ్మ ఇళ్ల కోసం 59, ప్రవాసి ప్రజావాణికి 1 దరఖాస్తు, ఇతర శాఖలకు సంబంధించి 29 దరఖాస్తులు అందినట్లు సీఎం ప్రజావాణి ఇన్‌ఛార్జ్ జీ.చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌ వెల్లడించారు.