News September 19, 2024

‘జమిలి’కి రాష్ట్రాలు అంగీకరిస్తాయా?

image

జ‌మిలి ఎన్నిక‌లు జ‌ర‌గాలంటే కీల‌క రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌ల‌తో పాటు రాష్ట్రాల స‌మ్మ‌తి కూడా అవసరం. జ‌మిలికి 14 రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదిస్తూ తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఈ విష‌యంలో ఎన్డీయేకి ఇబ్బందులు లేన‌ట్టే క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం దేశంలో 20 రాష్ట్రాల్ని ఎన్డీయే మిత్ర‌ప‌క్షాలు పాలిస్తున్నాయి. అందులో 13 రాష్ట్రాల్ని బీజేపీ సొంతంగా ఏలుతోంది. దీంతో ఈ విష‌యంలో ఎన్డీయేకి ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి లేదు.

Similar News

News November 9, 2025

చిరంజీవికి థాంక్స్.. అలాగే క్షమాపణలు: RGV

image

కల్ట్ మూవీ ‘శివ’ ఈనెల 14న రీరిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందానికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు. ‘చిరంజీవికి ధన్యవాదాలు. నేను మిమ్మల్ని అనుకోకుండా బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను. మీ విశాల హృదయానికి మరోసారి థాంక్స్’ అని ట్వీట్ చేశారు.

News November 9, 2025

ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

image

<>ఎయిమ్స్ <<>>మంగళగిరి 10 నాన్ ఫ్యాకల్టీ, కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. అనంతరం హార్డ్ కాపీని డిసెంబర్ 10 వరకు పంపాలి. సీనియర్ ప్రోగ్రామర్, అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫీసర్, బయో మెడికల్ ఆఫీసర్, లా ఆఫీసర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in

News November 9, 2025

అయ్యప్ప దీక్షతో ఆరోగ్యం కూడా..

image

అయ్యప్ప దీక్ష 41 రోజుల పాటు ఉంటుంది. కానీ, దీని ప్రభావం ఆ భక్తులపై ఎప్పటికీ ఉంటుంది. ఈ దీక్ష ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడమే కాక శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తుంది. మెడలో రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం ధరించడం వలన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. 41 రోజుల ఈ సామాన్య జీవనం దీక్షానంతరం ఆదర్శవంతమైన ఆరోగ్యకర అలవాటుగా మారుతుంది. శబరిలో స్వామి దర్శనంతో దీక్ష ముగుస్తుంది, కానీ ఆరోగ్య జీవనశైలి మాత్రం కొనసాగుతుంది.